Health

ఏ వయస్సులో ఏ టీకా ఇవ్వాలి? చిన్న పిల్లలున్న ప్రతి ఒక్కరు త‌ప్ప‌క‌ నోట్ చేసుకోవాల్సిన స‌మాచారం.!

చిన్నతనంలో పిల్లలు అనారోగ్యాలు మరియు వైకల్యాల బారిన పడకుండా నివారించడానికి ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడం కోసం టీకాలు వేయడం అనేది అతి ప్రధానమైన అంశం. ఇప్పుడు ఏ వయస్సులో ఏ టీకా ఇవ్వాలి. ఆ విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. 
పుట్టిన వెంటనే ——– BCG. మరియు ఓరల్ పోలియో టీకా,
6 వారాలకు—————DPT , హెపటైటిస్ బి, ఓరల్ పోలియో,
10 వారాలకు————–DPT, హెపటైటిస్ బి, ఓరల్ పోలియో
14 వారాలకు————– DPT., హెపటైటిస్ బి, ఓరల్ పోలియో
9 మాసాలకు————– మీజిల్స్,
16 – 24 నెలలు———– DPT., పోలియో, బూస్టర్ డోసుల
శిశువుకు ఐదేళ్ళ వయసు వచ్చే వరకు జూన్, జనవరి నెలలలో ప్రతి ఆరు నెలలకు ఒక సారి – విటమిన్-A చుక్కలు ఇవ్వాలి.
టీకాల ద్వారా నిరోధించగల అంటు వ్యాధులు:

1. డిఫ్తీరియా : ఇంటిలో పిల్లలకి గొంతులో అంగుటమీద తెల్లటి పొర ఏర్పడి తీవ్ర జ్వరం, దుష్పలితాలు ఏర్పడతాయి. చాలా ప్రాణాపాయం.

2. ప‌ర్ట్యూసిస్ : (కోరింత దగ్గు) ఇందులో పిల్లలు జ్వరం, విపరీతంగా తెరలు తెరలుగా దగ్గుతూ నీరసించి పోతారు. ప్రాణాపాయం ఎక్కువ.

3. టెటనస్ – ధనుర్వాతం : దీని వలన జ్వరం, ఫిట్స్, విల్లులుగా వెనక్కి విరచుకుపోతారు. ప్రాణం పోవచ్చు.

4. పోలియో – పక్షవాతం : దీనిలో జ్వరంతో మొదలై కొద్దిపాటి విరేచనాల తరువాత కాళ్ళు చేతులు పక్షవాతంకి గురి అవుతాయి.

5. BCG : ఈ టీకావలన క్షయ వ్యాధి రాకుండా నివారించొచ్చు.

6. పొంగు : మీజిల్స్ టీకా వలన పిల్లలకి ఈ వ్యాధి రాకుండా నివారించొచ్చు.

7. హెపటైటిస్ -B : కాలేయమునకు సంబంధించిన వ్యాధులు రాకుండా నివారించొచ్చు.