Movies

ఈ నటుడు కెరీర్ లో సంపాదించిన ఆస్తిని ఏమి చేసారో తెలిస్తే చాలా గ్రేట్ అంటారు

నర్రా వెంకటేశ్వర రావు గారు ఎక్కువగా సహాయ, విలన్, హాస్య పాత్రలలో నటించారు. అయన 1947 వ సంవత్సరంలో ప్రకాశం జిల్లాలోని అగ్రహారం అనే గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుండి నాటకాలు వేసేవారు. ప్రజా నాట్యమండలిలో చాలా చురుకుగా పాల్గొని ఎన్నో స్టేజ్ షో లను ఇచ్చారు. ఒంగోలుకి చెందిన గోపీచంద్ తండ్రి టి.కృష్ణ, పోకిరి బాబురావు,మాదాల రంగారావు లతో ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది. దాంతో నిదానంగా సినిమాల వైపు అడుగులు వేశారు. ఆయన 1974 లో చదువు సంస్కారం అనే సినిమా తో సినీరంగ ప్రవేశం చేశారు. 
మంచి విప్లవ భావాలూ కలిగిన వ్యక్తిగా పేరుగాంచారు. SP ,లాయర్,మంత్రి వంటి పాత్రలలో ఎక్కువగా నటించారు. అలాగే విలన్ పాత్రలకు ప్రాణం పోశారు. సినీ కెరీర్ ప్రారంభంలో విలన్‌గా చేసినా ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నేటి భారతం చిత్రంలో ఆయన నటనను ఇప్పటికి ప్రేక్షకులు మర్చిపోలేరు.అలాగే ఆయన మంచి ఆర్టిస్టుగానే కాక సినీ పరిశ్రమలో వివాదరహితుడుగా, మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నారు.ఆయన భార్య పేరు సుశీల. వారికి ఒక కొడుకు మురళి, ఒక కూతురు వసంతలక్ష్మి ఉన్నారు. అయన ఆయుధం, చట్టంతో పోరాటం,యువతరం కదిలింది,ప్రతిఘటన,రేపటి పౌరులు,కర్తవ్యం,తొలి ప్రేమ,చిన్నా,ఇంద్ర,నువ్వొస్తానంటే నేనొద్దంటానా,వర్షం,ఆపరేషన్ దుర్యోధన,మేస్త్రి,జయసింహ వంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి మెప్పించారు. నర్రా కు దాసరి నారాయణరావు గారు మంచి మంచి పాత్రలను ఇచ్చి ప్రోత్సహించారు. దాసరి నటించి దర్శకత్వం వహించిన ‘మేస్త్రి’ సినిమా నర్రా వెంకటేశ్వర రావు గారికి చివరి సినిమా. 
అయన సంపాదించిన ఆస్తిని ఒంగోలుకి చెందిన ప్రజా నాట్యమండలికి ఇచ్చి ప్రజలలో చైతన్యం తీసుకువచ్చే స్టేజ్ షో లకు ఎటువంటి ఆటంకం కాకుండా ఆర్ధికంగా చేయూతను ఇచ్చారు. ఆయన క్యాన్సర్‌తో పోరాటం చేస్తూ డిసెంబరు 27, 2009 న 62 సంవత్సరాల వయసులో మరణించారు.