Politics

ఎవరు ఊహించని సంచలన నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్ చెల్లి సుహాసిని… షాక్ లో NTR,కళ్యాణ్ రామ్

రాజకీయాల్లో వారసత్వం ఎప్పటినుంచో వస్తున్నదే. ఇక సినిమాల్లో కూడా వారసత్వం ఈమధ్య పెరిగింది. ఇక సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, వాళ్ళ వారసులను రాజకీయ రంగంలోకి తీసుకు రావడం మామూలు అయింది. ముఖ్యంగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి, తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు ఆయన అల్లుడు చంద్రబాబు పార్టీని నడుపుతున్నారు. ఇక కొడుకు నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యునిగా,పొలిట్ బ్యూరో సభ్యునిగా పనిచేసారు. మరో కుమారుడు బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక చంద్రబాబు తనయుడు లోకేష్ శాసనమండలిలో ప్రవేశించి,మంత్రి అయ్యారు.

ప్రస్తుతం తెలంగాణా ఎన్నికలు జరుగుతున్నాయి. ముందస్తుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సారధ్యంలో ఏర్పడిన మహాకూటమిలో తెలుగుదేశం పార్టీ కూడా ఉంది. సీట్ల సర్దుబాట్లలో భాగంగా టిడిపికి కేటాయించిన సీట్లలో బలమైన అభ్యర్థులను దించాలని చంద్రబాబు యోచిస్తున్నారు.

ముఖ్యంగా కూకట్ పల్లి నుంచి కీలక అభ్యర్థి కోసం కసరత్తు మొదలుపెట్టారు. నందమూరి హరికృష్ణ మరణంతో ఆ కుటుంబం నుంచి ఒకరికి ఛాన్స్ ఇవ్వాలన్న యోచన వచ్చిందట. వెంటనే హీరో కళ్యాణ్ రామ్ ని సంప్రదించారట. అయితే తాను రాజకీయాలకు సూట్ కానని, సినిమాలే బెస్ట్ అని చెప్పేశాడట. దీంతో హరికృష్ణ కూతురు సుహాసిని పేరు పరిశీలనలోకి తీసుకున్నారట.

ఆమెను నిలబెడితే,జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రచారానికి వస్తాడని,ఇక తారక్ ప్రచారం అనగానే వెనక్కి తిరిగి చూడక్కర్లేదని టిడిపి భావిస్తోందట. సుహాసిని అత్తింటి వాళ్ళు కూడా పొలిటికల్ ఫామిలీ కావడం విశేషం. ఆమె రాజమండ్రి మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి రావు కి కోడలు. కాకినాడ ఎస్సార్ ఎం టి అధినేతకు బంధువు.సెటిలర్స్ ఎక్కువగా ఉండే కూకట్ పల్లి అయితే ఓట్లు దండిగా పడతాయన్న ఆలోచన చేస్తున్నారట. ఏ రకంగా చూసినా విన్నింగ్ ఛాన్సెస్ ఉండడంతో సుహాసినిని బరిలోకి దించినా ఆశ్చర్యపడక్కర్లేదు.