స్టార్ యాంకర్ సుమ ఇంట్లో ఎన్ని తెలుగు సినిమాలు షూటింగ్ జరిగాయో తెలుసా.?
మళయాళీ భామ అయిన సుమ తెలుగు ఎంత స్వచ్ఛంగా మాట్లాడుతుందో మనకు తెలిసిన విషయమే. ఆమె యాంకర్ గా బిజీ బిజీగా గడిపేస్తుంది. ఆమె ఒక వైపు యాంకర్ గా కొనసాగుతూనే మరో పక్క ప్రొడక్షన్ హౌస్ స్థాపించి షోస్ చేస్తూ చాలా బిజీగా ఉన్నది. ఇది చాలదు అన్నట్టు సుమకు మరో సంపాదన కూడా ఉంది. అది ఏమిటంటే తన ఇంటిని సినిమా షూటింగ్స్ కి అద్దె ఇస్తుందట. ఇప్పటివరకు ఈ విషయం బయటకు రాలేదు. ఈ మధ్య సుమ ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటో చుసిన వారికి ఈ ఇల్లు ఎక్కడో చూసినట్టు అనిపించింది. అప్పుడు తీగ లాగితే డొంక కదిలినట్టు అసలు విషయం బయటకు వచ్చింది. సుమ ఇంటిలో ఏ సినిమాలు షూటింగ్ చేసారో ఇప్పుడు చూద్దాం.
నాగ చైతన్య ,తమన్నా జంటగా నటించిన 100 % Love సినిమాలో నాగ చైతన్య ఇల్లు.
ఎన్టీఆర్,కాజల్ జంటగా నటించిన బాద్షా సినిమాలో కాజల్ ఇల్లు.రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన బ్రూస్ లీ సినిమాలో రామ్ చరణ్ ఇల్లు.మహేష్ బాబు,సమంత జంటగా నటించిన దూకుడు సినిమాలో మహేష్ బాబు ఇల్లు.సునీల్ హీరోగా నటించిన పూలరంగడు సినిమాలో విలన్ ఇల్లు.