అక్కను నమ్మి ఇండస్ట్రీకి వచ్చిన గంగోత్రి హీరోయిన్ పరిస్థితి ఏమిటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ?
గుజరాతీ కుటుంబంలో జన్మించి అమెరికాలో స్దిరపడి న్యూ జెర్సీ లో పుట్టి పెరిగిన ఆర్తి అగ్రవాల్ ఇండియా సినిమా ఇండస్ట్రీ లో 16 ఏళ్ళ వయసులో 2001 లో విడుదలైన ‘పాగల్ పన్’ అనే బాలీవుడ్ సినిమా తో ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ కి వెంకటేష్ తో కలసి నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ అనే సినిమాలో హీరోయినే గా ఎంట్రీ ఇచ్చింది . ఈ సినిమా హిట్ కావడం తో తెలుగు సినిమాలలో మంచి అవకాశాలు వచ్చాయి. చిరంజీవి , వెంకటేష్, బాలకృష్ణ , నాగార్జున లతోనే కాకుండా మహేష్ బాబు , జూనియర్ NTR, నితిన్ లతో నటించింది.వరుసగా బి. గోపాల్ దర్శకత్వంలో నాలుగు సినిమాలలో నటించింది. వెంకటేష్ తో నటించిన మూడు సినిమాలు హిట్ అయ్యాయి. ఆ తరువాత అమెరికాలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. ఆమె ఊబకాయం, శ్వాస కొస వ్యాధి తో బాధపడ్డారు. ఆమె లైపో సర్జరీ వికటించడంతో మరణించారు. ఆమెతో పాటు ఆమె చెల్లెలు అదితి అగ్రవాల్ ‘గంగోత్రి’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైయింది. ఆ సినిమా తరువాత ఆమెను వెతుక్కుంటూ చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో శ్రీ ఆంజనేయం మరియు వర్షం సినిమాలు కూడా ఉన్నాయి. శ్రీ ఆంజనేయం సినిమాను ముందు ఒప్పుకుంది.కానీ ఆ సినిమాలో పూల గుమగుమ అనే సాంగ్ లో చాల బోల్డ్ గా నటించాలని కాస్త ఎక్స పోజింగ్ చేయాలనీ డైరెక్టర్ చెప్పడంతో ఆమె మొహమాటం లేకుండా మొఖం మీదే నేను చేయనని ఖరాకండిగా చెప్పింది. అప్పుడు ఆ సినిమా డైరెక్టర్ కృష్ణ వంశి ఆ స్కీన్లు చేయకపోతే సినిమాలో కూడా నటించవద్దని చెప్పడం తో అదితి అగ్రవాల్ కి కోపం వచ్చి ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అక్కడినుండి వెళ్ళిపోయింది. ఆ తరువాత వెంటనే ఒక సినిమాకు ఒప్పుకోవడం వల్ల డేట్స్ లేకపోవడంతో వర్షం సినిమాను వదులుకోవలసి వచ్చింది.ఇలా ఈ రెండు సినిమాలు దూరం అయ్యాక ఆమెకు మంచి సినిమాలలో అవకాశం రాలేదు. ఇద్దరు పెద్ద డైరెక్టర్స్ ను కాదనుకున్న అదితి అగ్రవాల్ ను హీరోయిన్ గా ఎంచుకోవడానికి ఏ డైరెక్టర్ కూడా ముందుకు రాలేదు. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినా అవి హిట్ కాలేదు అందుకని ఆమె ఇండస్ట్రీ కి దూరం అయ్యింది. మధ్యలో యంగ్ హీరో ఆది తో సుకుమారుడు అనే సినిమా లో నటించిన ఫలితం లేకపోవడం తో తాను ప్రేమించిన అబ్బాయి ని పెళ్ళిచేసుకుని హ్యాపీగా జీవితాన్ని గడిపేస్తుంది.
శ్రీ ఆంజనేయం సినిమాలో ఛార్మి చేసిన ఆ పాటను చూసి ఆ పాటను చేయడం కన్నా ఆ సినిమాను వదులుకోని మంచి పని చేశానని తానె స్వయంగా చెప్పింది. ఆ సినిమా హిట్ కాకపోవడంతో ఆ సినిమా తానూ చేయకుండా బయటకు వచ్చి మంచి పని చేసానని చెప్పింది. ఇది ఆమె పరిస్దితి.