Movies

సోగ్గాడు శోభన్ బాబు మరణించిన రోజు ఏం జరిగిందో తెలుసా?

సినిమాల్లో చేరడం అంటే అంత ఈజీ కాదు. చెప్పులు అరిగేలా తిరగాలి. ఒకటికి పదిసార్లు ఫెరఫార్మెన్స్ చూపించాలి. అయినా అందరికీ పనవ్వదు. దానికి లక్కుండాలి మరి. సరే ఆరోజుల్లో అందరిలాగే సినిమా రంగం మీద మమకారంతో కాళ్లరిగేలా తిరిగి సినీ రంగంలోకి వచ్చి సోగ్గాడుగా రాణించి,వన్నె తగ్గకుండానే సినిమాలనుంచి స్వచ్ఛందంగా తప్పుకున్న అందాల నటుడు శోభన్ బాబు. నటనలో ఉన్నత శిఖరం చేరి, సంపదలోనూ ఉన్నతంగా ఎదిగాడు. అయితే హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయిన శోభన్ బాబు చివరి రోజులు ఎలా గడిచాయో ఓసారి పరిశీలించాల్సిందే. తమ అభిమాన నటుడి మరణం వార్త తెలుసుకుని ఆంధ్రా నుంచి పెద్దఎత్తున అభిమానులు తరలివచ్చి, శాంతినికేతన్ లో అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

సినీ రంగంలో ఎదిగాక, అంతకుముందు కొందరు సినీ నటుల జీవితాలను చూసిన మీదట ఎలా బతకాలో, ఎలా ఉండకూడదో శోభన్ బాబు నేర్చుకున్నాడు. కోట్లకు పడగలెత్తి కూడా చివరిరోజుల్లో అందరూ చందాలు వేస్తె తప్ప కాటికి పోనీ ఎందరో మహానటుల జీవితాలను ఔపోసన పట్టిన శోభన్ బాబు తన జీవితాన్ని అందుకు భిన్నంగా మలచుకున్నారు.

పదిమందికీ కూడా ఆ దారి చూపించి, నడవమన్నారు. అందుకే ప్రతి రూపాయి, కూడబెట్టిన సొమ్ము కూడా భూమిపైనే పెట్టుబడిగా పెట్టారు. మద్రాసు నగరంలో 50భవనాలు ఆయన సొంతం అంటే మాటలు కాదుకదా. మద్రాస్ నుంచి హైదరాబాద్ కి సినీ రంగం వచ్చినపుడు తన ఆస్తుల కారణంగా అక్కడే ఉండిపోయిన శోభన్ బాబు ఒంటరి వాడయ్యాడు.

ఇక ఛాన్స్ లకోసం దేబరించకుండా 1996జనవరి 1న తనకు తానె సినిమాలనుంచి తప్పుకున్నారు. ఎంతమంది వచ్చి అడిగినా నటించలేదు. రైటర్ మెంట్ తర్వాత మొదటి 5ఏళ్ళు ఆవిధంగా, చివరి ఏడేళ్లు మరోవిధంగా గడిపాడు.కారు డ్రైవ్ చేయడం అంటే సరదా గల శోభన్ తన బిల్డింగ్స్ చూసుకుంటూ డ్రైవ్ చేసుకుని వెళ్ళేవాడు. సొంతంగా మేకప్ చేసుకుంటూ , గ్లామర్ కాపాడుకున్నారు. తన అందమే తనను ఈస్థాయికి చేర్చిందని విశ్వసించేవారు.

ఓ ఫంక్షన్ లో ఓ పెద్దావిడ ఏమిటి ఇలా అయిపోయారు అని అనడంతో ఇక ఆరోజు నుంచి బయటకు వెళ్లడం మానేశారు. చివరి ఏడేళ్లు తక్కువమంది ఫ్రెండ్స్ లో డ్రైవింగ్ కి వెళ్లడమో,ఇంట్లోనే ఉండిపోవడంతో చేసేవారు. బిల్డింగ్ పైకి ఎక్కి మద్రాస్ అందాలను చూస్తూ ఒంటరిగా గడిపేవారు. ఇక 7పదుల వయస్సులో అందం తగ్గిపోతోందన్న వాస్తవాన్ని అంగీకరించలేకపోయేవాడు. సినిమా కన్నా డబ్బుకి ప్రాధ్యాన్యత ఇచ్చానే తప్ప,సినిమా కోసం ఏమీచేయలేదని,ఏ రాజకీయ పార్టీతో సంబంధం పెట్టుకోలేదని,ఫలితంగా ఒంటరిగా మిగిలానని మదన పడేవారట.

అందుకే తెలుగు సినిమా 75ఏళ్ళ పండుగకు స్వయంగా నిర్వాహకులు పిలిచినా వెళ్ళలేదు. యోగా చేయడం,తెల్లటి మల్లెపూల వంటి బట్టలు వేసుకుని,టాకింగ్ చైర్ లో ఊగుతూ కూర్చుని,హిందూ పేపర్ చదివేవారు. ఇక 2008ఫిబ్రవరి 8న ఆయన చెల్లెలు ఝాన్సీ మరణంతో ఆయన కుంగిపోయారు. తనకూ సమయం దగ్గర పడిందంటూ కలత చెందేవారు. అదేసమయంలో నాకు ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవుకనుక వందేళ్లు బతుకుతా అని గాంభీర్యం ప్రదర్శించేవారు. అయితే రోజూ లాగే పేపర్ చూస్తూ, రాకింగ్ చైర్ లో ఊగుతూ, టిఫిన్ కోసం ఎదురుచూస్తూ కుప్పకూలిపోయారు.