Movies

టాలీవుడ్ మన్మధుడు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

టాలీవుడ్ మన్మధుడు తన సినీ కెరీర్ మొదలు పెట్టి 30 సంవత్సరాలు దాటి పోయింది. ఈ సందర్భంగా నాగార్జున గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. 

1. నాగార్జున లిటిల్ ఫ్లవర్ కాలేజ్ లో ఇంజనీరింగ్ లో బ్యాచలర్స్ డిగ్రీ చేసాడు. ఆ తర్వాత అమెరికాలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో M.S చేసాడు. ఇలా చదువు పూర్తి అయ్యాకనే సినిమాల్లోకి వచ్చాడు.

2. నాగార్జున ‘విక్రం’ సినిమా ద్వారా హీరోగా సినీ రంగ ప్రవేశం చేసాడు. 1986 లో విడుదల అయ్యిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆదరకోట్టింది. 
3. నాగార్జున మొదట రామానాయుడు కూతురు అయిన లక్ష్మిని 1984 లో వివాహం చేసుకున్నాడు. అయితే వీరు 1990 లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగ్ తనతో కలిసి నటించిన అమలను వివాహం చేసుకున్నాడు. నాగార్జున – లక్ష్మి దంపతుల కుమారుడు నాగ చైతన్య,నాగార్జున – అమల దంపతుల కుమారుడు అఖిల్ ఇద్దరూ సినీ రంగంలో హీరోలుగా ఉన్నారు.
4. నాగార్జున హీరోగానే కాకుండా బుల్లితెరపై నిర్మాతగా అనేక సీరియల్స్ నిర్మించి సక్సెస్ అయ్యాడు. అంతేకాక మా టివిలో వచ్చే ‘మీలో ఎవరు కోటిస్వరుడు’ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూ ఆ కార్యక్రమానికి రేటింగ్స్ పెంచేసాడు. 

5. తెలుగులో సుమారు 90 సినిమాల వరకు చేసిన నాగ్, తన హిట్ సినిమా ‘శివ’ రీమేక్ ద్వారా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. 
6. టాలీవుడ్ మన్మడుడుగా పేరు తెచ్చుకున్న నాగార్జున అన్నమయ్య,భక్త రామదాసు,షిర్డీ సాయి వంటి భక్తీ రస సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. 

7. తమిళ దర్శకుడు తెలుగులో డైరెక్ట్ గా ఒకే ఒక సినిమాను చేసారు. అది నాగార్జున నటించిన ‘గీతాంజలి’ సినిమా. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి నాగార్జున కెరీర్ లో ఒక మంచి సినిమాగా నిలిచింది. 

8. అమితాబ్ తో కలిసి కళ్యాణ్ జ్యుయరల్స్ యాడ్స్ లో కనిపించాడు. అలాగే మూడు తరాల నటులు కలిసి నటించిన మనం సినిమాలో అమితాబ్ అతిధి పాత్రను పోషించాడు. 
9. అక్కినేని నాగేశ్వర రావు ఆఖరి సినిమా ‘మనం’ సినిమాలో అక్కినేనితో పాటు కొడుకు నాగార్జున,మనుమలు నాగ చైతన్య,అఖిల్ కూడా నటించారు. 

10. నాగార్జున,అమల బ్లూ క్రాస్ సంస్థకు కో పౌండర్స్ గా ఉన్నారు.