Politics

హరికృష్ణ కూతురు సుహాసిని గురించి ఈ విషయాలు మీకు తెలుసా?ఆమె ఏ రంగంలో ఉన్నారో తెలుసా?

రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు,అనుకోని ఘటనలు జరుగుతాయి. ఎవరు తెరమీదికి వస్తారో,ఎవరు తెరమరుగు అవుతారో చెప్పలేం. అందునా ఎన్నికల్లో ఎత్తుకు పై ఎత్తులు సహజం కనుక ఆచితూచి అభ్యర్థుల గెలుపు దృష్టిలో ఉంచుకుని టికెట్స్ కేటాయిస్తారు. ప్రస్తుతం తెలంగాణాలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల్లో సుహాసిని పేరు తెరమీదికి వచ్చింది నందమూరి కుటుంబానికి చెందిన ఈమె కూకట్ పల్లి నుంచి బరిలో దిగుతోంది. నామినేషన్ కూడా వేసింది. దీంతో ఈమె పేరు ఒక్కసారిగా మారుమోగుతోంది. నందమూరి సుహాసిని గురించి వివరాల్లోకి వెళ్తే,ఈమె నందమూరి హరికృష్ణ కూతురు. రాజమండ్రి మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరిరావు కొడుకు శ్రీకాంత్ ని వివాహం చేసుకున్న సుహాసిని ఎప్పుడూ రాజకీయాల్లో లేరు. ఒక్కసారిగా ఇప్పుడు తెరమీదికి వచ్చింది.

నిజానికి నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యునిగా, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యునిగా పనిచేసారు. ఆయన హఠాన్మరణంతో ఆ కుటుంబం నుంచి ఒకరిని రాజకీయాల్లోకి తేవాలని ఎపి సీఎం చంద్రబాబు ఆలోచన చేసారు. వెంటనే ప్రతిపాదన పంపారు. అయితే హరికష్ణ కొడుకు కళ్యాణ్ రామ్ ని బరిలో దింపాలని చూశారట. కానీ అతడు వెనకడుగు వేయడంతో అనూహ్యంగా సుహాసిని పేరు తెరమీదికి తెచ్చారు.

నందమూరి,నారావారి కుటుంబాలు ఒక్కటేనన్న సంకేతాలు పంపడానికి వీలుగా ఉండడం,కూకట్ పల్లి ఓటర్లలో అధిక శాతం సెటిలర్స్ కావడం, ఈ సీటుని ఎక్కువమంది ఆశిస్తుండడం ఇలా అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు చాకచక్యంగా సుహాసిని ఎంపిక చేసారు. సుహాసిని వయస్సు 37ఏళ్ళు. చదువులో ఏక్టివ్ గా ఉండేదట. ఇక జూనియర్ ఎన్టీఆర్ కన్నా రెండేళ్లు పెద్దది. భర్త శ్రీకాంత్ వ్యాపారంలో పాలుపంచుకుంటున్న సుహాసిని ఎప్పుడూ పాలిటిక్స్ గురించి ప్రస్తావన తేలేదు.

హరికృష్ణ ఏకైక కుమార్తెగా సుహాసిని కి చొరవ,దూకుడు ఎక్కువేనట. కల్యాణ రామ్,జానకి రామ్ ల కన్నా యాక్టివ్ ఎక్కువేనట. అందుకే ఆమెను తాత పోలిక అంటూ హరికృష్ణ మురిసిపోయేవాడట. ఆమె ధైర్యం ఎలాంటిదో చెప్పాలంటే, పోటీకి కళ్యాణ్ రామ్ నో అంటే,నేను రెడీ అని సుహాసిని చెప్పేయడమే కారణం. కాంగ్రెస్ సపోర్ట్,సెటిలర్స్ ఓట్లు,కల్సి వస్తాయని , ఇక కళ్యాణ్ రామ్,జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తే తిరుగుండదని భావిస్తున్నారు.