Politics

ప్రొ కబడ్డీ లీగ్ లో అత్యధిక ధర పలికిన ఈ ఆటగాళ్ళ రేటెంతో తెలుసా?

మన దేశంలో ఐపీఎల్ తరువాత ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)ను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ సారి ఈ లీగ్ 6వ సీజన్ టోర్నమెంట్ ప్రస్తుతం జరుగుతోంది. అక్టోబర్ 7, 2018వ తేదీన ప్రారంభమైన ప్రొ కబడ్డీ లీగ్ 6వ సీజన్ జనవరి 6, 2019వ తేదీ వరకు కొనసాగనుంది. ఇక ఈ లీగ్‌కు గాను ఈ ఏడాది మేలో వేలం పాట నిర్వహించారు. ఇందులో భారీ మొత్తాలకు పలువురు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ సారి వేలంలో అత్యధిక ధర పలికిన టాప్ 10 ప్రొ కబడ్డీ లీగ్ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందామా.

మను గోయత్ – రూ.1.51 కోట్లు – హర్యానా స్టీలర్స్
రాహుల్ చౌదరి – రూ.1.29 కోట్లు – తెలుగు టైటాన్స్
దీపక్ హుడా – 1.15 కోట్లు – జైపూర్ పింక్ ప్యాంథర్స్
నితిన్ తోమర్ – 1.15 కోట్లు – పూనెరి పాల్టన్‌
రిశ్వంక్ దేవదిగ – 1.11 కోట్లు – యూపీ యోధా
ఫజెల్ అట్రాచలి – 1 కోటి – యు ముంబా
ప్రశాంత్ కుమార్ రాయ్‌ – 79 లక్షలు – యూపీ యోధా
అబోజర్ మిఘని – 76 లక్షలు – తెలుగు టైటాన్స్
సురేందర్ నడా – 75 లక్షలు – హర్యానా స్టీలర్స్
సందీప్ ధుల్‌ – రూ.66 లక్షలు – జైపూర్ పింక్ ప్యాంథర్స్