Movies

ఈ సీనియర్ కమెడియన్ పరిస్థితి,కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు…పాపం

సినిమా వాళ్ళు మామూలు మనుషులే కదా. వాళ్ళకి కష్ఠాలు, కన్నీళ్లు, బాధలు, ఇబ్బందులు ఉంటాయి. ఒక్కోసారి వాళ్ళ కష్టం చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఇక ఓ తెలుగు కమెడియన్ అమెరికా వెళ్లి మానిపనిషిగా సెటిల్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే,వారాలబ్బాయి సినిమాలో నత్తిగా నిట్టిగా మాట్లాడే నటి కృష్ణ వేణి గుర్తుంది కదా. 13ఏళ్లకే పెళ్ళిచేసుకుని, 14ఏళ్లకే పాపకు జన్మినిచ్చిన ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి,కేరక్టర్ ఆర్టిస్ట్ గా , కమెడియన్ గా కొనసాగింది. పెళ్లయ్యాక, పాప పుట్టాక భర్తతో పొసగలేదు. నాటకరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె తన సొంతమేనమామ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కూతురితో సహా చెన్నైలో సెటిల్ అయింది.

అసలు కృష్ణవేణి కుటుంబంలో చాలామంది సినీమాల్లో ఉన్నారు. 13మంది సంతానంలో నాల్గవది. ఈమె పెద్దక్క కూతురు టాలీవుడ్ లో సపోర్టింగ్ యాక్టర్ గా రాణిస్తున్న రజిత. ఇక 13మందిలో చివరి అమ్మాయి నటి రాగిణి. రజిత, రాగిణి కూడా కమెడియన్స్ గా హాస్యం పండించారు. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో వారాలబ్బాయి,పిచ్చి పంతులు,ఓ తండ్రి తీర్పు,విజృంభణ, జీవన పోరాటం,వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజా చంద్రతో ప్రేమలో పడి, ముగ్గురు పిల్లల తండ్రి అయినా సరే కృష్ణవేణి అతడిని పెళ్లి చేసుకుంది.

కొన్నాళ్ళు అన్యోన్యంగా ఉన్నారు. రాజాచంద్ర డైరెక్టర్ గా బిజీ గా ఉండడంతో కుటుంబ బాధ్యతలకు కృష్ణవేణి కొన్నాళ్ళు పరిమితం అయింది. అయితే ఆరోజున ఉన్నట్టుండి ఏమైందో ఏమో గానీ రోడ్డుపక్కన రాజాచంద్ర శవమై కనిపించాడు. ఇక జీవితం గడవాలంటే తప్పదని మళ్ళీ నటించడం మొదలెట్టింది.

కృష్ణవేణి కూతురిని కూడా హీరోయిన్ ని చేయాలని చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో ఆ అమ్మాయికి పెళ్లి చేసింది. సినిమాల్లో సంపాదించిన సొమ్ము కూతురికోసమే అన్నట్లు ఆమెకు కొన్ని స్థిరాస్థులు సంపాదించి పెట్టింది. అయితే వియ్యాల వారు డబ్బులకోసం కృష్ణవేణిని నానారకాలుగా హింసించారు. ఇక డబ్బులకోసం 90ఏళ్ళ ముసలావిడకు పనిమనిషిగా చేసింది. ఇలా నాలుగేళ్లు అమెరికాలో కష్టపడ్డానని కృష్ణవేణి ఎమోషనల్ చెప్పుకొచ్చింది. అలా సంపాదించిన సొమ్ముతో మణికొండలో ఇల్లు కట్టుకుని స్థిరపడినట్లు అలీతో జాలిగా ప్రోగ్రాం లో కృష్ణవేణి వివరించింది.