Movies

బయోపిక్ ల కాలంలో కాంతారావు మూవీ ఏమవుతుందో తెలుసా… కాంతారావు పిల్లలు ఎలా ఉన్నారో తెలుసా?

టాలీవుడ్ లో కావచ్చు,కోలీవుడ్ కావచ్చు,చివరకు బాలీవుడ్ అయినా సరే,ఒక్కోసారి ఒక్కొక్క ట్రెండ్ నడుస్తుంది. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు జానపద చిత్రాల నటుడిగా ఖ్యాతిగాంచిన కాంతారావు జీవితం ఆధారంగా ఓ బయోపిక్ వస్తోంది. ఇప్పటికే సావిత్రి జీవితం ఆధారంగా మహానటి సినిమా రావడం,బ్లాక్ బస్టర్ అవ్వడం నేపథ్యంలో అన్ని బయోపిక్ లు ఊపందుకున్నాయి. మహానటి తెరకెక్కించిన విధానం అందరికీ నచ్చి వసూళ్లు భారీగానే రాబట్టింది. కాంతారావు భార్య , కొడుకు రాజా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. కాంతారావుకి ముగ్గురు కొడుకులు,ఒక కూతురు. పెద్ద కొడుకు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాడు.

కూతురు హైదరాబాద్ లో ఉంటోంది. ఎవరి జీవితం వారిది,ఎవరి కష్టాలు వారివి అన్నట్లు ఉంది. రాజా చదువుకోకపోవడంతో ఉద్యగం చేసే పరిస్థితి ఏర్పడింది. అయితే తెలంగాణ సర్కార్ ఇచ్చే10వేల పెన్షన్ లో ఆరువేలు ఇంటి అద్దెకు అయిపోతోంది. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఆయన కుమారుడు ప్రధాన పాత్ర పోషిస్తూ రెండు భాగాలుగా కథానాయకుడు,మహానాయకుడు పేరిట క్రిష్ దర్శకత్వంలో తయారవుతున్నాయి. పలువురు ప్రముఖ నటీనటులు ఇందులో నటిస్తున్నారు.

ఇక దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా మరో మూవీ తెరకెక్కుతోంది. ఇక తెలంగాణా సీఎం కేసీఆర్ బయోపిక్ గా ఉద్యమ సింహం రూపుదిద్దుకుంటోంది. అలాగే తెలంగాణ దేవుడు అంటూ మరో బయోపిక్ కేసీఆర్ పై తెరకెక్కుతోంది. ఇక అమర గాయకుడు ఘంటసాల జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ఈ మూవీ విడుదలకు సిద్ధం అవుతోందట.

ఇక కత్తి కాంతారావు బయోపిక్ శరవేగంగా పూర్తిచేస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ పిసి ఆదిత్య ఈ చిత్రంని తెరెకెక్కిస్తున్నారు. రాకుమారుడు అనే పేరు ఈ మూవీకి ఖరారు చేసారు. కొన్ని ఘటనలు తెలుసుకోడానైకి కాంతారావు సొంతూరు కూడా డైరెక్టర్ వెళ్లారు. కాంతారావు చివరి దశలో ఎదుర్కొన్న కష్టనష్టాలు అందరికీ ఓ గుణపాఠంగా డైరెక్టర్ చెప్పుకొచ్చారు.

పరిశోధన తర్వాత ఓ గొప్ప వ్యక్తి జీవితాన్ని తెరమీద ఆవిష్కరిస్తున్నందుకు ఆనందం వేస్తోందన్నారు. ఇక కాంతారావు పుట్టినరోజున ఆయన పేరిట తపాలా సఖ ఓ పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసింది. అలనాటి హీరోలు ఎన్టీఆర్ , ఏ ఎన్ ఆర్ లకు ధీటుగా కాంతారావు పేరు తెచ్చుకున్నాడు. ఇక కాంతారావు బయోపిక్ రాకుమారుడు ఆడియో వేడుకకు రెడీ అవుతున్నాడు.