Movies

మనసంతా నువ్వే సినిమాలో తూనీగ తూనీగా అంటూ ఆడిపాడిన చైల్డ్ ఆర్టిస్ట్ సుహాని ఇప్పుడెలా ఉందో తెలుసా ?

సినిమా ఇండస్ట్రీలో అందం,అభినయంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. చైల్డ్ ఆర్టిస్ట్ లుగా రాణించి, పెద్దయ్యాక సినిమాల్లో హీరోయిన్ గా స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. మధ్యలోనే కెరీర్ ముగిసిపోయి వెళ్లిపోయిన వాళ్ళూ ఉన్నారు. అలాంటి వాళ్లలో సుహాని ఒకరు. ఈమె ఎవరంటే, మనసంతా నువ్వే సినిమాలో తూనీగ తూనీగా అంటూ ఆడిపాడి అలరించిన చైల్డ్ ఆర్టిస్ట్..1991డిసెంబర్ 25న పుట్టిన ఈమె తెలుగు,మలయాళం,తమిళం, బెంగాలీ మూవీస్ లో నటించింది.

కాన్వెంట్ హైస్కూల్ లో స్టడీ పూర్తిచేసి,ఇండియన్ బిజినెస్ స్కూల్ లో బిజినెస్ మేనేజ్ మెంట్ పూర్తిచేసిన సుహాని, ఇక మోడల్ గా అనేక స్టేజ్ షోల్లో సుహాని పాల్గొంది. సవ్యసాచి ముఖర్జీతో క్యాట్ వాక్ చేసింది. శాంసంగ్,ఔరత్ బ్రదర్స్ ,శరవణ స్టోర్స్ ,వీడియోకాన్ వంటి బ్రాండ్స్ కి అంబాసిడర్ గా చేసింది. పలుదేశాల్లో మోడలింగ్ చేస్తున్న ఈమె వయస్సు 27ఏళ్ళు. అయితే inkaa పెళ్లి చేసుకోలేదు.

అతి చిన్న వయస్సులోనే అంటే 16ఏళ్లకే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా మారిపోయిన సుహాని కేవలం 7,8సినిమాలకే ఛాన్స్ లు కోల్పోయింది. వయస్సుకి మించిన హీరోలతో నటించడంతో పాటు సినిమాల ఎంపికలో చేసిన పొరపాట్లు ఈమె కెరీర్ ని దెబ్బతీశాయి. 40 తెలుగు సినిమాలు,
5హిందీ మూవీస్ ,ఒక బెంగాలీ సినిమా,ఒక సినిమా మలయాళం లో చేసింది.

ప్రస్తుతం అడపాదడపా మోడలింగ్ షోస్ చేస్తోంది. అయితే కాస్త బొద్దుగా మారిన సుహాని ని గుర్తుపట్టడం కష్టమైంది. ఇదేంటి ఇలా మారిపోయిందని అందరూ అనుకున్నారు. అయితే మొత్తానికి కాస్త సన్నబడి మునుపటి రూపం తెచ్చుకుంది. ఏది ఏమైనా అందం , అభినయం ఉండికూడా సినిమా ఇండస్టీ నుంచి దూరమవ్వడం కొంచెం బాధాకరమే.