Movies

ఈ భామలు ఒక్కో సినిమాకి ఎంత పారితోషికం తీసుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఒకప్పుడు లక్షల్లో ఉండే రెమ్యునరేషన్ ఇప్పుడు కోట్లకు చేరింది. సినిమా ఖర్చు కూడా భారీగా పెరిగిపోయింది. అందరికీ ఇచ్చే రెమ్యునరేషన్ ఒక ఎత్తు అయితే హీరో హీరోయిన్స్ కి ఇచ్చే పారితోషికం మరో ఎత్తు. హీరోలతో సమానంగా కొందరు హీరోయిన్స్ కూడా పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. అసలు ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారో పరిశీలిస్తే, జయ సింహ సినిమాలో నటించడానికి నయనతార ఏకంగా ఒక కోటి 75లక్షలు తీసుకుంది. సినిమాకు కేవలం 30రోజులు మాత్రమే కేటాయించింది. దీన్ని బట్టి ఈ అమ్మడు రోజుకి ఆరు లక్షలు రెమ్యునరేషన్ దక్కించుకుంది. దీంతో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా పేరు తెచ్చుకుంది.

ఇక కథానాయక ప్రాధాన్యత గల పాత్రకు ఐతే నయనతార రెండున్నర కోట్లు తీసుకుంటోంది. అనుష్క కూడా అదే రేంజ్ లో ఉంది. ఒక సినిమాకు ఒకటిన్నర కోటి నుంచి రెండు కోట్ల వరకూ లాగుతోందట. భాగమతి మూవీకి అయితే రెండుకోట్లు తీసుకుంది. ఇక కొత్త తారలతో రకుల్ ప్రీత్ సింగ్ డిమాండ్ మొన్నటిదాకా భారీగానే ఉండేది.

జయ నాయక జై సినిమాకు కోటిన్నర తీసుకుందట. ఆమె కెరీర్ లో ఇదే భారీ రెమ్యునరేషన్ అట. అయితే ఛాన్స్ లు నిలబెట్టుకోడానికి ఇప్పుడు 90లక్షలకు దిగిపోయింది. తమన్నా విషయానికి వస్తే,మంచి జోరుమీదుండగా,కోటి రూపాయలకు ఎప్పుడూ తగ్గలేదట. హవా కొంత తగ్గినా సరే,రెమ్యునరేషన్ విషయంలో తగ్గడం లేదు.

ఇక కాజల్ విషయం తీసుకుంటే మెగాస్టార్ చిరంజీవి సరసన ఖైదీ నెంబర్ 150లో నటించినందుకు ఒక కోటి పాతిక లక్షలు ముట్టాయట. అయితే ఈ మధ్య ఓ యువ హీరో సరసన నటించడానికి అడిగితె,రెండుకోట్ల వరకూ డిమాండ్ చేసిందట. ఇక శృతిహాసన్ కూడా కోటి రూపాయలు తీసుకున్న హీరోయిన్ కావడం విశేషం.

ఇక కోటికి తగ్గినవాళ్లను పరిశీలిస్తే,రాశిఖన్నా, అనూ ఇమ్మానియేల్,సాయిపల్లవి ఇలా వీరందరూ కూడా కోటి రూపాయలకు దరిదాపుల్లో ఉన్నవాళ్లే. ఫిదా కోసం 40లక్షలు సాయిపల్లవి డిమాండ్ చేసింది. అనుపమ పరమేశ్వరన్ అయితే 40లక్షలు అందుకుంది. మొత్తానికి హీరోయిన్స్ కి దక్షిణాదిన మంచి డిమాండ్,మార్కెట్ ఉన్నాయి .