Movies

తారకరత్న పరిస్థితి ఎలా ఉందో తెలుసా…. ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?

సినిమాల్లో రాణించాలంటే టాలెంట్,బ్యాక్ గ్రౌండ్ ఉంటె చాలదు. లక్కుండాలి. టాలెంట్ ఉండికూడా ఛాన్స్ లు రాక మరుగున పడ్డవాళ్ళు ఉన్నారు. ఇక బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే,రాణించలేని వాళ్ళూ ఉన్నారు. అదేసమయంలో టాలెంట్ ఉండి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా రాణించనవాళ్లు ఉన్నారు. బ్యాక్ గ్రౌండ్ తో టాలెంట్ జోడించి దూసుకెళ్ళేవాళ్ళూ ఉన్నారు. అందుకే రంగుల ప్రపంచంలో ఇలాంటి వింతలెన్నో కనిపిస్తాయి. ఇక విశ్వవిఖ్యాత ఎన్టీఆర్ తన నటనతో తెలుగునాట చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన నట వారసునిగా బాలకృష్ణ అగ్ర హీరోగా ఎదిగాడు. హరికృష్ణ కూడా బాగా రాణించాడు.

మూడో తరంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా యంగ్ టైగర్ గా దూసుకెళ్తున్నాడు. కళ్యాణ్ రామ్ కూడా మంచి పాత్రలతో హిట్స్ అందుకున్నాడు. అయితే నందమూరి కుటుంబంలో మరో నటుడు తారకరత్న సినీ రంగ ప్రవేశంతోనే ఏకంగా ఏడు సినిమాలు ప్రారంభించి మరీ ఎంట్రీ ఇచ్చాడు. నిజానికి ఇలాంటి ఘటన వరల్డ్ లో ఏ నటుడికీ జరగలేదు. అయితే ఇతడికి పెద్దగా గుర్తింపు రాలేదు. ఇప్పటిదాకా 8సినిమాలు చేసాడు. అయినా ఒక్కటీ బ్రేక్ ఇవ్వలేదు.

అంతేకాదు,తొలిచిత్రం అతిరధ మహారథుల నడుమ ప్రారంభమైతే,ఇప్పుడు అసలు తారకరత్నతో సినిమాలు తీయడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ తీసినా చూసే ఆడియన్స్ కూడా లేరు. అందుకే ఇతడి సినీ జీవితం చప్పగా సాగి,ముగిసిపోతోందని చెప్పాలి. ఆర్థికపరంగా ఇతడి జీవితానికి,నట జీవితానికి చాలా తేడా ఉంది.
Taraka Ratna
ప్రస్తుతం కేరక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు. అయితే అమృత వర్షిణి సినిమాలో హీరోగా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కి మీడియా సమావేశం పెడితే,ప్రముఖ న్యూస్ చానల్స్ వాళ్ళు ఎవరూ రాకపోవడం, ఆ చిత్రం తాలూకు వార్త ఎక్కడా కనపడలేదు. ఇదంతా చూస్తుంటే, అయ్యో తారకరత్న అనుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."