Politics

సైనా,కశ్యప్ ల వెడ్డింగ్ కార్డు వైరల్… ఎలా ఉందో చూడండి

పెళ్లి అనేది నూరేళ్ళ పంట అంటారు. పెళ్లంటే ఎంతోసందడి. ఇక పెళ్ళికి కొత్త బట్టలు,నగలు,ఫంక్షన్ హాలు, ఫుడ్ ఇలా అన్నీ తమ రేంజ్ కి తగ్గట్టు రిచ్ గానే ఉండాలని అందరూ ప్లాన్ చేసుకుంటారు. ఇక వెడ్డింగ్ కార్డుల్లో కూడా రిచ్ నెస్ చూపించడం వెరైటీగా భావిస్తున్నారు. ఇక సెలబ్రిటీల పెళ్లి ఐతే చెప్పక్కర్లేదు. వచ్చే డిసెంబర్ లో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా పెళ్లి చేసుకుబోతోంది. తోటి ఆటగాడు పారుపల్లి కశ్యప్ తో ఆమె వివాహం జరుగబోతోంది.

నిజానికి కొద్దికాలంగా ప్రేమాయణం సాగిస్తున్న సైనా,పారుపల్లి కశ్యప్ వచ్చే డిసెంబర్ 16న పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్యూలో సైనా స్వయంగా చెప్పుకొచ్చింది. 2005లో పుల్లెల గోపీచంద్ అకాడెమీలో శిక్షణ పొందుతున్న సమయంలోనే ఇద్దరి మధ్యా ఏర్పడ్డ ఫ్రెండ్ షిప్ కాస్తా ప్రేమ గా చిగురించింది. ఇక వీరి పెళ్లి పత్రిక ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. హైదరాబాద్ మాదాపూర్ లోని ఓ ప్రముఖ హోటల్ లో వీరి వివాహం జరుగబోతున్నట్లు హల్ చల్ చేస్తున్న వెడ్డింగ్ కార్డులో ఉంది.

తమ లవ్ వ్యవహారం పేరెంట్స్ కి ఎప్పుడు చెప్పకపోయినా వాళ్ళే పసిగట్టారని నైనా చెప్పింది. తమ కెరీర్ కి అడ్డు రాకూడదన్న ఉద్దేశ్యంతో ఇన్నాళ్లూ పెళ్ళికి దూరంగా ఉన్నామని చెప్పింది. నేను ప్రేమించేదెవరినో పేరెంట్స్ తెలుసుకుని అర్ధం చేసుకున్నారని, పెళ్లయ్యాక కూడా ఆటకు బ్రేక్ పడబోదని సైనా వివరించింది. ఎందుకంటే డిసెంబర్ 22నుంచి జరిగే ప్రీమియర్ లీగ్ లో ఆమె పార్టిసిపేట్ చేస్తుంది. ఏది ఏమైనా ఆమె పెళ్లి విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.