Movies

రోబో 2.o లో పక్షి రాజు క్యారెక్టర్ రియల్ లైఫ్ లో ఈయనే….ఎవరో తెలుసా?

విజువల్ వండర్స్ లో భారతీయ సినిమా ఏమాత్రం తీసిపోదని బాహుబలి విజువల్ ఎఫెక్ట్స్ నిరూపిస్తే, దాన్ని అధిగమించి ‘రోబో 2.ఓ’ లో గ్రాఫిక్స్ మాయాజాలం ఉంది. ఇక యానిమేషన్స్ కూడా అద్భుతంగా చేయించారు. దాదాపు 600కోట్ల రూపాయల భారీ వ్యవయంతో తెరకెక్కించిన ఈ సినిమా లో సూపర్ స్టార్ రజనీకాంత్,అమె జాక్సన్ ప్రధాన పాత్రలలో నటించారు. ఐతే ఈ మూవీ ద్వారా బాలీవుడ్ నటుడు అక్షయ కుమార్ సౌత్ ఇండియాకు పరిచయం అయ్యాడు. అంతేకాదు ఈ చిత్రం అతని కెరీర్ కి గీటురాయి గా నిలిచిందని చెప్పాలి. మొబైల్ ఫోన్స్ ద్వారా అత్యధిక రేడియేషన్ రావడం వలన పక్షి జాతులు అంతరించిపోతున్నాయని,పక్షులే లేకుంటే ఈ భూమిపై మానవుడు కూడా జీవించలేడని ఈ చిత్రం చాటిచెప్పింది.

అందుకే పక్షిరాజు పాత్రతో అక్షకుమార్ ని చూపించారు క్రేజీ డైరెక్టట్ శంకర్. ఈ భూమిపై మనుషులకే కాదు పక్షులకు అన్ని జీవరాశులకు హక్కు ఉందని చాటిచెప్పిన ఈ చిత్రంలో పక్షిరాజు పాత్రలో అక్షయ్కుమార్ ఓడిపోయాడు. ఈ పాత్రకు ప్రేరణ ఎవరంటే పర్యావరణ వేత్త,ప్రఖ్యాత విహంగ శాస్త్ర నిపుణుడు, సలీం అలీ. ఇతని జీవితంలోని కొన్ని ఘట్టాలను ఆధారం చేసుకుని పక్షిరాజు కేరక్టర్ ని డైరెక్టర్ శంకర్ డిజైన్ చేసాడు.

ఈ మూవీ కథారచయిత జై మోహన్ పక్షిరాజు పాత్రకోసమే సలీం అలీని స్ఫూర్తిగా తీసుకోడానికి గల కారణాలను వివరించాడు. నిజానికి సలీం బతికుంటే, సాంకేతిక పేరుతొ జరుగుతున్న అన్యాయాన్ని చూసి ఆవేశానికి లోనవ్వడం ఖాయమని మోహన్ చెబుతూ అందుకనుగుణంగా పక్షి రాజు పాత్రని క్రియేట్ చేసాడట. పక్షుల గురించి చాలా పరోశోధనలు చేసి,బర్ద్ మేన్ ఆఫ్ ద ఇండియాగా ప్రపంచ పర్యావరణ వేత్తలు ముద్దుగా పిలుచుకునే సలీమ్ అలీ పక్షుల కోసం ఎంతో కృషి సాగించాడు.

రాజస్థాన్ లోని భరత్ పూర్ లో సలీం అలీ పక్షుల కోసం దేశంలోనే తొలి అభయారణ్యం ఏర్పాటుచేశాడు. పక్షుల జీవనాన్ని చాటిచెప్పే ఎన్నో అద్భుత బుక్స్ రాసాడు. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ ఏర్పాటులో ముఖ్యపాత్ర పోషించాడు. ఇక ఈయన చేసిన సేవలకు పద్మభూషణ్,పద్మ విభూషణ్ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. 1987జూన్ 20న ఈయన తుదిశ్వాస విడిచారు. ఈయనను స్ఫూర్తిగా తీసుకుని తీయడం ద్వారా ఇది కల్పిత కథ కాదని స్పష్టం చేస్తున్నారు.