Politics

శ్రీహరికోట నుండే రాకెట్స్ ఎందుకు ప్రయోగిస్తారో తెలుసా?

సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందాలంటే శాటిలైట్ లు తప్పనిసరి. ఒకప్పుడు విదేశీ పరిజ్ఞానంతో రాకెట్లు,శాటిలైట్స్ ప్రయోగించిన భారత్ క్రమేపి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రయోగాలు చేస్తూ విజయాలను నమోదు చేసుకుంటోంది. అయితే ఎక్కువగా రాకెట్స్ ని ఏపీలోని శ్రీహరి కోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగిస్తుంటారు. ఇక్కడ నిత్యం ఇస్రో ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. నిజంగా శ్రీహరి కోట భారత్ అంతరిక్ష పరోశోధనలకు అరుదైన ఛాన్స్ గల ప్రదేశం. అయితే దేశంలో ఎన్నో ప్రాంతాలుండగా కేవలం శ్రీహరి కోట నుంచి ఇలా ప్రయోగం చేయడానికి చాలా కారణాలున్నాయని అంటున్నారు. అందులో ముఖ్యమైన కొన్ని తెలుసుకుందాం.

భూమధ్య రేఖకు శ్రీహరికోట దగ్గరగా ఉండడం వలన,ఇక్కడ నుంచి ప్రయోగాలు చేస్తే,సెకనుకు 0. 4 కిలోమీటర్లు అదనపు వేగం వస్తుందట. దీనికి అదనపు ఖర్చు ఉండదు. అలాగే భూ భ్రమణం వలన గంటకు 14వందల 40 కిలోమీటర్ల వేగం గాల్సి వస్తుందట. భూమి గంటకు ఒక లక్షా 85వేల కిలోమీటర్ల వేగంతో సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అలా భూమి తిరిగే సమయంలో రాకెట్ ప్రయోగిస్తే అది కూడా మంచి వేగం పుంజుకుంటుందని, భూమధ్య రేఖకు సమీపంగానే ప్రపంచంలోని రాకెట్ ప్రయోగ కేంద్రాలన్నీ ఉన్నాయని చెబుతున్నారు.

రాకెట్ ప్రయోగ సమయంలో భూమి కంపిస్తుంది. దాన్ని తట్టుకునేలా భూమి దృఢంగా ఉండాలి. అందుకే శ్రీహరి కోట ను ఎంచుకున్నారు.
సమాచార శాటిలైట్స్ కూడా భోమధ్య రేఖకు కొంచెం అటుఇటు తిరుగుతాయి. అందుకే భోమధ్య రేఖ నుంచి దగ్గరలో రాకెట్ ప్రయోగం వలన ఆ కక్ష్యలోకి సాటిలైట్ చేర్చడం కూడా సులువు అవుతుంది. అందుకే సమాచార ఉపగ్రహాలను భూమధ్య రేఖ సమీపం నుంచే ప్రయోగిస్తారు. ఒక్కోసారి రాకెట్ లు కూలిపోతే,వాటి శకలాలు భూమిమీద పడతాయి.

అలాంటప్పుడు అక్కడ జన నివాసాలుంటే చాలా ప్రాణనష్టం సంభవిస్తుంది. అందుకే పెద్దగా జన సంచారం లేని శ్రీహరికోటకు రాకెట్ ప్రయోగాలకు ఎంచుకున్నారు. శ్రీహరికోటకు దగ్గర నుంచి సుదూర తీరప్రాంతం ఉంటుంది. ఇళ్ళు,జనసంచారం ఉండవు. ఇక జల,వైమానిక,రోడ్డు రవాణాలు అందుబాటులో ఉంటాయి. విఫలమయిన రాకెట్ శకలాలు సముద్రంలో పడతాయి. ఎక్కువ వర్షపాతం,ఎండలు లేకుండా ఉండకూడదు. అందుకే శ్రీహరి కోట పూర్తిగా అనువైనది.