Movies

స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ ఆఫీస్ ఎంత లగ్జరిగా ఉంటుందో చూడండి

స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ ఏమి చేసిన చాలా స్టైలిష్‌ గా ఉంటుంది. అలాగే ప్రతి సినిమాలోనూ స్టైల్ గా ఉండేలా ప్లాన్ చేస్తూ ఉంటాడు. అల్లు అర్జున్ ఆ మధ్య అన్ని హంగులతో కూడిన ఒక ఇంటిని నిర్మించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఇంటిలో అల్లు అర్జున్‌ తన కోసం ఒక అల్ట్రా స్టైల్‌ ఆఫీస్‌ను రూపొందించుకున్నాడట.

ఇప్పటివరకు అల్లు అర్జున్ కి ప్రత్యేకంగా ఆఫీస్ అంటూ ఏది లేదు. గీతా ఆర్ట్స్‌ ఆఫీస్‌ ని ఇప్పటివరకు తన ఆఫీస్ గా వాడుకున్నాడు. కథా చర్చలు అన్ని ఇక్కడే సాగించేవాడు. కానీ ఇప్పుడు ప్రత్యేక ఆఫీస్ పెట్టుకుంటున్నాడు. త్వరలోనే అల్లు అర్జున్‌ నిర్మాతగా మారబోతున్నాడనే వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. త్వరలోనే కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించబోతున్న అల్లు అర్జున్‌కు కొత్త ఆఫీస్‌ కావాల్సి వచ్చిందట. అందుకే జూబ్లీహిల్స్‌లో ఒక ఆఫీస్‌ నిర్మాణం చేయించాడు.

ఆ ఆఫీస్ మొత్తం అల్లు అర్జున్ తన అభిరుచి మేరకు డిజైన్ చేయిస్తున్నాడు. ప్రశాంత వాతావరణం ఉండేలా, కళ్లకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా లైట్‌ కలర్స్‌తో, హాల్‌ మరియు బాల్కనీలో చెట్టు, అత్యంత ఖరీదైన మార్బుల్స్‌, డిజైన్డ్‌ సీలింగ్‌, సెంట్రల్‌ ఏసీతో పాటు ప్రత్యేకమైన మినీ థియేటర్‌ను కూడా ఏర్పాటు చేశారట. కథ చర్చలు మరియు సినిమాలకు సంబంధించిన ఇతర విషయాలను ఈ ఆఫీస్‌లో ఇకపై బన్నీ చేయబోతున్నాడు. ఇలాంటి ప్రశాంతమైన ఆఫీస్‌లో తన దర్శకులతో కథలు రాయించుకుంటాడట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."