Movies

పెప్సీ యాడ్ లో కన్పించిన మొదటి స్టార్ పవన్ కళ్యాణ్… ఆ తర్వాత పెప్సీ యాడ్ ఎందుకు చేయలేదో….???

దక్షిణాదిన మొదటిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెప్సీ యాడ్ లో నటించాడు. కొన్ని సంవత్సరాలు ఆ యాడ్ లో కనిపించిన పవన్ ఆ తర్వాత ఆ యాడ్ లో కన్పించటం లేదు. దానికి గల కారణం తెలిస్తే పవన్ మీద అభిమానం పెరుగుతుంది. పవన్ పెప్సీ యాడ్ లో నటించినప్పుడు ఆ బ్రాండ్ వ్యాల్యూ ఆంధ్రప్రదేశ్(అప్పటికి విడిపోలేదు) లో బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు పవన్ తాగేది పెప్సీ…మనం అదే త్రాగుదామని అందరు పెప్సీ కి ఎడిక్ట్ అయ్యిపోయారు. 
కొన్ని రోజుల తర్వాత కూల్ డ్రింక్స్ లో పెస్టిసైడ్స్ ఉన్నాయని పుకార్లు రావటంతో పవన్ ఆ యాడ్ నుంచి తప్పుకున్నారు. ఎందుకంటే ఆ డ్రింక్ త్రాగిన తన అభిమానులకు ఏమైనా అవుతుందేమో అని భావించి తప్పుకున్నాడు. ఆ తర్వాత పవన్ యాడ్ లలో కన్పించిన దాఖలాలు లేవు. 
పవన్ ఒకే అంటే చాలా పెద్ద పెద్ద కంపెనీలు కోట్లు ఇవ్వటానికి రెడీగా ఉన్నాయి. అయినా అభిమానుల కోసం ఆ ఆఫర్స్ అన్నింటిని రిజెక్ట్ చేసేసాడు. తనకు ఉన్న ఫ్యాన్స్ లో ఎక్కువగా తాను చెప్పిన మాటకు గౌరవిస్తారని, తాను ఏ యాడ్ లో నటించినా ఆ ప్రభావం అభిమానులపై ఉంటుందని పవన్ అభిప్రాయపడ్డారట. అందుకే వారు ఎన్ని కోట్ల డీల్ ఇచ్చినా పట్టించుకోలేదు.. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."