Devotional

కార్తీకమాసంలో ఏమి చేసిన చేయకపోయినా డిసెంబర్ 3 వ తారీఖు ఆఖరి సోమవారం ఈ ఒక్కటి చేస్తే పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం

కార్తీక మాసం అంటే శివునికి చాలా ప్రీతికరమైనది. కుమారస్వామిని కృత్తికలు పెంచటం వలన కార్తీక మాసానికి కార్తీకం అని పేరు వచ్చింది. కార్తీక సోమవారం వ్రతం చేస్తే వెయ్యి అశ్వమేధాలు చేసిన పుణ్య ఫలం దక్కుతుంది. శివునికి ఉన్న తమోగుణాన్ని చంద్రుడు మాత్రమే హరించగలడు. అందువలన కార్తికమాసంలో సోమవారానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. శ్రీమహా విష్ణువుతో సమానమైన దేవుడు,గంగతో సమానమైన తీర్ధం, కార్తీకమాసంలో సమానమైన మాసం లేదని మన పురాణాలు చెపుతున్నాయి. ఈ కార్తీక మాసంలో శివ కేశవులు ఇద్దర్ని పూజిస్తారు. అలాగే శివ కేశవులు ఇద్దరికీ ఈ మాసం ప్రీతికరమైనది. ఈ కార్తీక మాసం ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైనది.

కార్తీక మాసం శుక్ల పక్ష పాడ్యమి నుండి పౌర్ణమి వరకు అనేక వ్రతాలను చేసుకుంటారు. కార్తీక మాసం మొదటి రోజు పాడ్యమి రోజు బలి పాడ్యమి, రెండో రోజు విదియ నాడు భగినీ హస్త భోజనం, అనేవి చాలా విశిష్టమైనవి. కార్తీకమాసంలో సూర్యోదయానికి ముందు స్నానాలు,దీప దానాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. శరత్ ఋతువులో నదులలో ఔషదాల సారం ఉంటుంది. అందువల్ల కార్తీక మాసం నదులలో స్నానము ఆచరించటం వలన మానసిక,శారీరక సమస్యలు తొలగిపోయి ఆయుర్ ఆరోగ్యాలు కలుగుతాయని మన పురాణాలు చెపుతున్నాయి.

కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు విశువు ఆలయంలో విష్ణు గీతాలు ఆలపిస్తే నూరు గోవులు దానం ఇచ్చిన ఫలితం కలుగుతుంది. నాట్యం చేస్తే సర్వ తీర్ధ స్నానం ఫలం, పూజ ద్రవ్యాలను సమర్పిస్తే అన్ని రకాల ఫలాలు అందుతాయి. శివాలయం,వైష్ణవాలయం లేకపోతే రవి చెట్టు దగ్గర కానీ తులసివనంలో గాని పూజలు చేయవచ్చు. కార్తీకమాసంలో చంద్రుడు కృత్తికతో కలిపి పూర్ణుడై ఉంటాడు కాబట్టి శివుణ్ణి ఆరాధించాలి. కార్తీక సోమవారం నాడు శివ కేశవులకు ప్రీతికరం కాబట్టి ఆ రోజు శివ కేశవులను ఆరాదిస్తే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. కార్తీక సోమవార వ్రతాన్ని ఆరు విధాలుగా ఆచరిస్తారు.

మొదటిది ఉపవాసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం శివునికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం చేసుకొని తులసి తీర్ధాన్ని సేవించాలి.

రెండోవది ఏకభుక్తం జపం,దానాలు,తపం చేసిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి సమయంలో తులసి తీర్ధం తీసుకోవాలి.

మూడొవది – నత్తం – పగలంతా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం అయ్యాక భోజనం లేదా అల్పాహారం తీసుకోవాలి

నాల్గొవది అయాచితం భోజనం ఆలోచించకుండా ఎవరైనా పిలిచి పెడితే మాత్రమే తినాలి.

ఐదవది – స్నానము – శక్తి లేనివారు స్నానము మరియు జపం చేసిన చాలు.

ఆరవది – కార్తీకమాసం గురించి పెద్దగా తెలియనివారు సోమవారం నువ్వులను దానం చేసిన సరిపోతుంది.

డిసెంబర్ 3 వ తారీఖు కార్తీకమాసంలో ఆఖరి సోమవారం ఏకాదశి తిధి ఉండుట వలన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అందువల్ల కార్తీకమాసంలో ఆఖరి సోమవారం రోజున పైన చెప్పిన ఆరు విధాలలో ఏది చేసిన కోటి జన్మల పుణ్యం దక్కుతుంది. కార్తీక పౌర్ణమికి 365 వత్తులను వెలిగించటం వీలు కానివారు కార్తీకమాసం ఆఖరి సోమవారం రోజున వెలిగించవచ్చు.