Politics

ఇంతకీ కేసీఆర్ తర్వాత సీఎం ఎవరో తెలుసా?

ఇంకా ఆరునెలల సమయం ఉండగానే ముందస్తు ఎన్నికలకు తెలంగాణా సర్కార్ రద్దుచేసిన సీఎం కేసీఆర్ వ్యూహానికి అనుగుణంగా ఎన్నికలు వచ్చేసాయి. టిఆర్ ఎస్ ఒంటరిగా బరిలో దిగింది. ప్రజా ఫ్రంట్ పేరిట కాంగ్రెస్, టీడీపీ,టిజెఎస్,సిపిఐ జట్టుకట్టి సీట్ల సర్దుబాటు తో బరిలో దూకాయి. బిజెపి,కూడా ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఇక మజ్లీస్ లాంటి పార్టీలు సరేసరి. అయితే టిఆర్ ఎస్ గెల్చి,మళ్ళీ సీఎం అవుతారా,ఒకవేళ కేసీఆర్ కేంద్ర రాజకీయాల వైపు మొగ్గుచూపితే,టి ఆర్ ఎస్ తరపున సీఎం ఎవరు అవుతారు, ఒకవేళ హంగ్ వస్తే, ఏమవుతుంది వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై జోరుగా చర్చ నడుస్తోంది.

ఇక కేసీఆర్ దక్షిణాది నుంచి సమర్ధవంతమైన నాయకుడన్న చర్చ కూడా నడుస్తోంది. నిజానికి తెలంగాణా ఏర్పడితే దళితులను సీఎం చేస్తానని అప్పట్లో కేసీఆర్ ప్రకటించినప్పటికీ అది జరగలేదు. మరి కేసీఆర్ కేంద్రానికి వెళ్తే,ఇప్పుడైనా దళితుణ్ణి సీఎం చేస్తారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ వారసులతో ఎవరికి ఛాన్స్ దక్కుతుందో అనే ప్రశ్న కూడా టి ఆర్ ఎస్ లో చర్చ నడుస్తోంది.

కొడుకు కేటీఆర్, కూతురు కవిత,మేనల్లుడు హరీష్ రావు లలో ఎవరు సీఎం అభ్యర్థి అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నిక మొదలుకుని,సిద్ధిపేట వరకూ అన్ని చోట్లా పట్టు నిలుపుకుంటూ వచ్చారు కేటీఆర్. ఇక కార్యకర్తలకు , నియాజక వర్గ ప్రజలకు అంత్యంత ఆప్తుడైన హరీష్ రావు ప్రత్యర్ధులు లేని నేతగా గుర్తింపు పొందాడు.

నిజానికి గత ఎన్నికల్లోనే సీఎం ఎవరైతే బాగుంటుందంటూ ఓ సంస్థ చేసిన సర్వేలో కేసీఆర్, హరీష్ అంటూ ప్రజల నుంచి అభిప్రాయం వచ్చింది. ఇలా చెప్పిన వాళ్లలో 30శాతం వరకూ యువత హరీష్ వైపు మొగ్గినట్లు తేల్చారు. అయితే సాగునీటి ప్రాజెక్ట్ లలో బిజీగా ఉన్నారంటూ హరీష్ కొంతకాలంగా నియాజకవర్గానికే పరిమితం అయ్యారు.

ఇక ప్రజా ఫ్రంట్ తరపున ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, బిజెపి తరపున కిషన్ రెడ్డి,డాక్టర్ కె లక్ష్మణ్ ల పేర్లు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి వినిపిస్తున్నాయి. మొత్తానికి కేసీఆర్ తర్వాత తెలంగాణా సీఎం ఎవరన్న దానిపై గట్టి చర్చ గల్లీ గల్లీలో నడుస్తోంది.