Movies

సిక్స్ ప్యాక్ హీరోలు – వారి డైట్ సీక్రెట్స్ ఏమిటో మీకు తెలుసా?

గతంలో వచ్చిన సినిమాలకు ఇప్పటి సినిమాలకు చాలా తేడా వచ్చేసింది. ఇప్పటి హీరోలు సిక్స్ ప్యాక్ పై మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు డైట్ విషయంలో చాలా తేడా ఉంటుంది. ఎవరెవరు సిక్స్ ప్యాక్ చేసారు,ఎలాంటి డైట్ తీసుకున్నారో తెలుసుకుందాం. హీరోల్లో మొట్టమొదటి సరిగా సిక్స్ ప్యాక్ తో దర్శనమిచ్చిన హీరో అల్లు అర్జున్ అని చెప్పాలి. ఓసారి బాలీవుడ్ లో జరిగిన ఈవెంట్ కి హాజరయినపుడు, సౌత్ ఇండియాలో హీరోలు ఫిట్ నెస్ కి ప్రాధాన్యత ఇవ్వరని ఓ యాంకర్ అనడంతో బన్నీ చాలా ఫీలయ్యాడు.

ఆవిధంగా ఛాలెంజ్ గా తీసుకుని దేశముదురు మూవీకోసం సిక్స్ ప్యాక్ చేసాడు. కొవ్వు పదార్ధాల జోలికి ఏమాత్రం వెళ్లకుండా కేవలం ప్రోటీన్ గల ఆహారాన్ని,గుడ్డు తెల్లసొనలు మాత్రమే తీసుకుంటాడు. బాహుబలి మూవీలో ప్రభాస్,రానా బాడీల మార్పు గురించి చూస్తే,ప్రభాస్ రెండున్నర గంటలకొకసారి ఆహరం తీసుకునేవాడట. ఉదయం ప్రోటీన్ పౌడర్ కల్పిన 40గుడ్ల తెల్లసొనలు బ్రేక్ ఫాస్ట్ లో తీసుకునేవాడట. కార్బో హైడ్రేడ్ లాంటి పదార్ధాల జోలికి వెళ్లకుండా గింజలు,బాదం, ప్రోటీన్స్ అధికంగా ఉండే పదార్ధాలను తినేవాడట.

దీనివలన 2నుంచి నాలుగువేల కేలరీలు పొందేవాడట. ఇక రానా ఉదయం ఓట్స్,8గుడ్ల తెల్లసొనలు,పుచ్చకాయ, బొప్పాయి లాంటివి తీసుకునేవాడట. బ్రేక్ ఫాస్ట్ ,లంచ్ కి మధ్య ప్రోటీన్స్ గల పండ్ల రసాలు తాగేవాడట. ఒమేగా చేపలు, ఆకుపచ్చ కాయగూరలు తీసుకునేవాడట. సాయంత్రం బ్రాడ్ స్లాష్ లు ,అరటి పండ్లు,రాత్రికి ప్రోటీన్స్ ఆహరం లాగించేసేవాడట.

పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన టెంపర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీతో ఆకట్టుకున్నాడు. ఇందుకోసం చల్లని పదార్ధాలు, పండ్లు,కాయగూరలు, ప్రోటీన్స్ గల ఆహరం తీసుకుంటాడట. అప్పుడప్పుడు తక్కువ మోతాదులో మీల్స్ తీసుకుంటారట. కాగా నాగార్జున బాడీ చేంజ్ కోసం ఉదయం గుడ్డు తెల్లసొనలు, బ్రెడ్ మధ్యాహ్నం రైస్ ,రోటీ,నాలుగు కర్రీలు,రాత్రికి ప్రోటీన్లు కలిగిన చేపలు, గ్రిల్ చికెన్ తీసుకునేవాడట. ఉదయం, మధ్యాహ్నం మధ్యలో దోస,పెసరట్టు,పొంగల్ లాంటివి లాగించేవాడట.

సునీల్ అయితే పూలరంగడు మూవీలో సిక్స్ పాక్ కోసం గుడ్డు తెల్లసొన తో పాటు వాటర్ ఎక్కువ తీసుకునేవాడట. ఐస్ క్యూట్,12 గుడ్డు తెల్ల సొనలు తినేవాడట. వన్,నేనొక్కడినే సినిమాలలో మహేష్ బాబు సిక్స్ ప్యాక్ చూపించాడు. ఇందుకోసం ఓట్స్ ,పాస్తా,స్పాస్,చేపలు,గ్రిల్ చికెన్ లను తీసుకోవడం ద్వారా కేవలం మూడు నెలల్లో బాడీ తీరుని మార్చుకున్నాడట.

ఇక ఎయిట్ ప్యాక్ చూపించిన నటుడు నితిన్. 24గుడ్ల తెల్లసొనలు,కేజిన్నర గ్రిల్ చికెన్,మూడు ప్రోటీన్ జ్యుస్ లు తీసుకుంటాడు. ఉదయం పూత 12గుడ్ల తెల్లసొన,ప్రోటీన్స్ జ్యూస్, మధ్యాహ్నం గ్రిల్ చికెన్ లాగిస్తాడట. అందుకే విక్టరీ మూవీలో ఆవిధంగా బాడీ చూపించ గలిగాడట.