Movies

హీరో హరీష్ గుర్తు ఉన్నాడా…ఇప్పుడు ఏమి చేస్తున్నాడో ఎక్కడ ఉన్నాడో…?

బాలనటులు గా ఎంట్రీ ఇచ్చి,పెద్దయ్యాక హీరోలుగా రాణించేవాళ్ళు ఉన్నారు. ఇక కొన్నాళ్ల తర్వాత కెరీర్ ముగిసిపోయేవాళ్లు ఉన్నారు. అదేవిధంగా ఒకప్పుడు బాలనటుడిగా,హీరోగా రాణించిన హరీష్ చిన్నప్పుడే నాలుగైదు భాషల్లో అది కూడా ఏకకాలంలో చేసాడు. మూతి మీద మీసం రాకుండానే హీరోగా వెలుగొందాడు ఈ మిల్కి బాయ్. 1979లో అక్కినేని హీరోగా వచ్చిన ముద్దుల కొడుకు చిత్రంలో అక్కినేని,శ్రీదేవి కొడుకుగా నటించాడు. ఎన్టీఆర్ సూపర్ హిట్ మూవీలో కూడా బాలనటుడిగా మెప్పించాడు. పంజాబీ కుటుంబానికి చెందిన హరీష్ కుటుంబం హైదరాబాద్ లో సెటిల్ అయింది.

హైదరాబాద్ లోనే పుట్టిన హరీష్ బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి,తెలుగులోనే కాకుండా ఆరోజుల్లో హిందీ,కన్నడ,మళయాళ,తమిళ భాషల్లో ఏకైక చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించాడు. 15ఏళ్లకే హీరో అయిన హరీష్ కెరీర్ లో మొత్తం 300మూవీస్ చేసాడు. 1983వరకూ బాలనటుడిగా అలరించి ఆతర్వాత వనటుడిగా పేరుతెచ్చుకున్న హరీష్ కి అమ్మాయిల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. 1995లో సంగీత అనే అమ్మాయిని పెళ్లాడాడు. వీళ్ళకి ఓ కుమారుడు ఉన్నాడు.

బాలీవుడ్ లోనే బాగా ఆదరణ పొందిన హరీష్ ఆతర్వాత కుర్ర హీరోల పోటీ పెరగడంతో బాలీవుడ్ లో సెటిల్ అయి,సపోర్టింగ్ రోల్స్ చేసాడు. అయితే అక్కడ కూడా స్లో అయ్యాడు. ప్రస్తుతం ముంబయిలోనే ఉంటున్న యితడు జీరో అనే మూవీలో నటించాడు. అసలు హీరోగా ప్రేమ ఖైదీ చిత్రం ద్వారా హరీష్ ఎంట్రీ ఇచ్చాడు. మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు నిర్మించిన ఈ చిత్రం తిరుగులేని హీరోగా నిలబెట్టింది.

మాలాశ్రీ హీరోయిన్ గా నటించిన ఈ యూత్ ఫుల్ లవ్ చిత్రంలో హరీష్ నటనకు ఆడియన్స్, ముఖ్యంగా యూత్ జేజేలు పలికారు. ‘ఏవండీ ఆవిడ వచ్చింది,మాధవయ్య గారి మనవడు, ఓహో నా పెల్లాంటి చిత్రాలు హరీష్ కెరీర్ ని మలుపు తిప్పాయి. పెళ్ళాం చెబితే వినాలి,బంగారు కుటుంబం,జైలర్ గారబ్బాయి,ఎస్పీ పరశురామ్ వంటి చిత్రాలు హరీష్ నటనకు ప్రశంసలు లభించాయి. తమిళ,మళయాళ,,హిందీ,కన్నడ భాషల్లో కూడా నటించాడు.