Movies

22 యేళ్ళకే తనువు చాలించిన ఆ హీరోయిన్ అంటే రజనీకి చాలా ఇష్టం… ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

అందమైన లోకమని అందరూ అంటుంటారు రామ రామ అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మా’ అంటూ వేదాంత ధోరణిలో సాగె పాటకు చక్కటి అభినయం చేసిన నటి ఫటా ఫట్ జయలక్ష్మి. ఈమె ఒకప్పటి స్టార్ హీరోయిన్. 1958లో చెన్నైలోని ఓ తెలుగు కుటుంబంలో పుట్టిన ఈమె 1970కాలంలో సినిమాల్లో ఓ ఊపు ఊపేసింది. చిన్నవయస్సులోనే తనువూ చాలించింది. ఈమెకు ఫాన్స్ కూడా ఎక్కువే. సెలబ్రిటీలు కూడా ఈమె నటనకు ఫిదా అయ్యారు. ఇక వెండితెరపై సూపర్ స్టార్ రజనీకాంత్ కనిపిస్తే చాలు ఆనందంతో ఆడియన్స్ ఉప్పొంగిపోతారు. ఈయన ను చూస్తే చాలు, తమిళ,తెలుగు,కన్నడ,మళయాళ,హిందీ అనే తేడా లేకుండా ఇండియన్ స్క్రీన్ మెరిసిపోతుంది. అందుకే రజనీ సినిమా కోసం దేశం మొత్తం పండగ వాతావరణం కనిపిస్తుంది.

వివిధ భాషల్లో స్టార్ హీరోలు కూడా రజనీకి వీరాభిమానులు. నాలుగు దశాబ్దాల రజనీ కెరీర్ లో ఎందరితోనో కల్సి నటించారు. ఆయన పక్కన ఒక్కసారి కనిపిస్తే చాలని చాలామంది ఉవ్విళ్ళూరుతారు. ఇక తాజాగా 2.ఓ మూవీతో వరల్డ్ వైడ్ స్క్రీన్ పై సందడి చేస్తున్న రజనీకాంత్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో తన పక్కన నటించిన వారిలో అభిమాన నటి ఎవరో చెప్పారు. ఇది విన్నాక అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతకీ రజనీ అభిమానం పొందిన ఆ నటి ఎవరంటే ఫటా ఫట్ జయలక్ష్మి.

ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నప్పుడు ముందుగా గుర్తొచ్చేది ఫటా ఫట్ జయలక్ష్మి. ఈమె 1974లో కె బాలచందర్ డైరెక్షన్ లో ‘అవళ్ వరు తొడైర్ కథై’మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర పోషించింది. ఆ పాత్రలో ఊతపదం ‘ఫటా ఫట్’ బాగా పాపులర్ అవ్వడంతో చివరికి ఆమె పేరుకి మొదట ఆ పదం వచ్చి చేరడంతో ఫటా ఫట్ జయలక్ష్మి గా గుర్తింపు పొందింది. ఇదే సినిమా తెలుగులో అంతులేని కథ పేరుతొ 1976లో రీమేక్ అయింది.

తెలుగు ,తమిళ,కన్నడ,మళయాళ భాషల్లో 66మూవీస్ లో నటించిన ఈమె కమలహాసన్,ఎన్టీఆర్,కృష్ణ,చిరంజీవి తదితర అగ్రనటుల సరసన నటించి మెప్పించింది. అయితే 1980లో స్లీపింగ్ టాబ్లెట్స్ మింగేసి మరణించింది. కేవలం 22ఏళ్ళ వయస్సులోనే పైగా కెరీర్ ఉన్నతస్థాయిలో ఉండగానే జయలక్ష్మి ప్రాణాలు తీసుకోవడం సౌత్ ఇండియా సినిమాను దిగ్బ్రాంతికి గురిచేసింది. అయితే 38ఏళ్ళక్రితం మరించినప్పటికీ రజనీకాంత్ ఆమెను మరిచిపోకపోవడమే కాదు నచ్చిన నటిగా చెప్పడం నిజంగా గ్రేట్.