Movies

హీరో నుంచి విలన్ గా మారిన వీరు తీసుకొనే పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

అన్ని రంగాల్లో వస్తున్నట్టే సినీ రంగంలో కూడా మార్పులు వస్తున్నాయి. విలన్లుగా వేస్తూ హీరోలు అవ్వాలని కలలుగని సాకారం చేసుకునేవారు ఆరోజుల్లో నటులు. కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయింది. హీరోలుగా రాణించి, ఇంకా రాణిస్తున్నవారు కూడా ప్రస్తుతం విలన్ లుగా నటిచడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. పైగా విలన్ వేస్తే వచ్చే రెమ్యునరేషన్ చూస్తే నిజంగా షాకవుతాం. తెలుగు,తమిళ,హిందీ ,కన్నడ తదితర రంగాల్లో ఇలాంటి పోకడలు కనిపిస్తున్నాయి. అలాంటి వారిని పరిశీలిస్తే,జగపతి బాబు ఫామిలీ ఓరియెంటెడ్ పాత్రలతో ఆకట్టుకుని లేడీస్ ఫాలోయింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మారిన పరిస్థితుల్లో విలనిజాన్ని కొత్త అర్ధం ఇస్తున్నాడు. అది హీరో అయినా,విలన్ అయినా ఏ పాత్ర అయినా సరే ప్రాధాన్యత ఉంటే వేయడానికి రెడీ అంటున్నాడు.

బాలకృష్ణ నటించిన లెజెండ్ మూవీ నుంచి ఇప్పటివరకూ పలు మూవీస్ లో విలన్ పాత్రలలో ఒదిగిపోయిన జగపతి బాబు ప్రస్తుతం రెండు నుంచి మూడు కోట్లు డిమాండ్ చేస్తున్నాడు.రంగస్థలంలో జగపతి బాబు కేరక్టర్ కి మంచి పేరు వచ్చింది. తాజాగా అరవింద సమేత వీర రాఘవలో వేసిన ఫ్యాక్షన్ పాత్రకు కూడా మంచి పేరే తెచ్చుకున్నాడు.

అంతెందుకు రానా విషయం తీసుకుంటే ఓ వైపు హీరోగా వేస్తూనే మరోవైపు విలనిజం పండించే పాత్రలతో మెప్పిస్తున్నాడు. బాహుబలి రెండు భాగాలూ కూడా రానాకు మంచి పేరు తెచ్చాయి. బాడీ లాంగ్వేజ్ మార్చుకుని పాత్రకు తగ్గట్టు మెప్పించాడు. ఇక 15కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నాడు.

ఇక తమిళ నటుడు మాధవన్ ఎన్నో సినిమాల్లో హీరోగా మంచి పేరే సంపాదించాడు. అయితే నాగ చైతన్య హీరోగా వచ్చిన సవ్యసాచి మూవీలో మాధవన్ విలన్ రోల్ తో మెప్పించాడు. ఇందుకోసం మూడు కోట్లు దక్కాయి. తమిళంలో పలు చిత్రాలతో బాగా రాణిస్తున్న ఆది పినిశెట్టి తెలుగులో కూడా బిజీ కావాలని కోరుకుంటున్నాడు. అందుకే హీరో పాత్రలతో పాటు పేరుతెచ్చే విలన్ పాత్రలకు కూడా రెడీ అవుతున్నాడు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సరైనోడు మూవీలో విలన్ గా ఆది నటన ఆడియన్స్ మదిలో చెరగని ముద్రవేసింది. యితడు కూడా ఒక్కో సినిమాకు మూడు కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నాడు.

టాలీవుడ్ లో హీరోగా సినిమాలు చేస్తున్న సుధీర్ అనూహ్యంగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి విలన్ గా వేసాడు. సుధీర్ నటించిన బాజీ మూవీ అనుకున్నంత ఆడకపోవడంతో తెలుగులో హీరోగా కంటిన్యూ అవుతున్నాడు. సుధీర్ విలన్ పాత్రకోసం కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. బాలీవుడ్ లో ప్రముఖ హీరోగా వెలుగొందుతున్న అక్షయ కుమార్ కూడా విలనిజం పండించాడు. తన హీరోయిజాన్ని పక్కకు నెట్టి, ప్రముఖ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.ఓ మూవీలో విలన్ గా అద్భుత నటన కనబరిచాడు. మేకప్ కే 3గంటలు పట్టడంతో, 28ఏళ్ళ హీరో కెరీర్ ఒక ఎత్తు అయితే విలన్ గా మరో ఎత్తు అయిందని అక్షయ్ అంటున్నాడు. ఈ సినిమాలో వేసిన యాంటీ రోల్ కోసం రోజుకి 2కోట్లు తీసుకున్నట్లు టాక్.

ఇక కన్నడ నటుడు సుదీప్ కన్నడంలో హీరోగా రాణిస్తూనే తెలుగు తదితర భాషల్లో విలనిజాన్ని పండిస్తున్నాడు. ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో నాని హీరోగా వచ్చిన ఈగ మూవీలో సుదీప్ విలన్ గా చేసిన నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఈ సినిమా కోసం సుదీప్ కి నాలుగు కోట్లు దక్కాయి. మరో కన్నడ నటుడు ఉపేంద్ర హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకుని,తెలుగులో కూడా హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు.

అయితే సన్నాఫ్ సత్యమూర్తి మూవీలో విలన్ గా ఉపేంద్ర నటన హైలెట్. ఈ మూవీకోసం మూడు కోట్లు అందుకున్నాడు. రోజా, ముంబయ్ వంటి మూవీస్ తో గ్లామర్ హీరోగా పేరుతెచ్చుకున్న అరవింద స్వామి చాలాకాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఊహించనివిధంగా విలన్ పాత్రతో దృవ సినిమాలో తనదైన శైలి కనబరిచాడు. ఇదే మూవీ తని ఒరువన్ పేరుతొ తమిళంలో వచ్చింది. అందులో నటించిన పాత్రనే తెలుగులో రీమేక్ సమయంలో చేసాడు. యితడు 5కోట్లు డిమాండ్ చేస్తున్నాడు.