Movies

అలనాటి విలన్ రావుగోపాలరావు చివరి రోజులు ఎలా గడిచాయో చూడండి…నమ్మలేని నిజాలు

నటుడు అంటే ఎలాంటి పాత్రనైనా చేసి మెప్పించేలా రూపాంతరం చెందాలి. కేవలం మూసలో కొట్టుకుపోవడం కాదు. విలన్స్ గా , కేరక్టర్ ఆర్టిస్టులుగా ఇతర భాషల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అయితే మన తెలుగు వాళ్ళు ఎన్ని రకాలుగానైనా తమ నటనతో మెప్పించగలరని గతంలో ఎందరో నిరూపించారు. ఇంకా కొందరు నిరూపిస్తున్నారు. ఎస్వీఆర్,కైకాల సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి,గుమ్మడి,రావు గోపాలరావు ఇలా ఎందరో మన తెలుగు నటులు విభిన్న పాత్రలతో మెప్పించారు. ఇప్పుడు రావు రమేష్ లాంటి వాళ్ళు అదేకోవలో నడుస్తున్నారు. విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే హీరోయిజం అంతగా ఎలివేషన్ అవుతుందని నిరూపించిన నటుడు రావు గోపాలరావు. మొదట్లో ఆయనకు డబ్బింగ్ చెప్పించారట. అయితే ఆతర్వాత ఆయన గొంతే సినీ పరిశ్రమకు వరం అయింది.

ఎన్టీఆర్, చిరంజీవి,రాజేంద్ర ప్రసాద్ వరకూ అందరి సినిమాల్లో కూడా హీరోకి ధీటుగా విలనిజం పండించి ఎన్నో హిట్ చిత్రాలకు ప్రాణంపోశారు. ఈయన డైలాగ్ డెలివరీ కి పెట్టింది పేరు. మొదట్లో ఈయన విలక్షణ గొంతు పనికిరాదన్న వాళ్ళే వన్స్ మోర్ అన్నారంటే ఈయన స్పెషాల్టీ అర్ధం చేసుకోవచ్చు. డైరెక్టర్,రచయిత చెప్పినట్టు కాకుండా తన డైలాగ్స్ ని కేరక్టర్ కి తగ్గట్టుగా మార్చేయడం ద్వారా తనపాత్రలపై బలమైన ముద్ర వేశారు.

కొంపలు కూల్చే కాంట్రాక్టర్ వేషంతో ముత్యాలముగ్గు సినిమా ద్వారా రావు గోపాలరావు నటజీవితం అనూహ్య మలుపు తిరిగింది. 1937లో జనవరి 14న కాకినాడ సమీపంలోని గంగనపల్లిలో జన్మించిన రావు గోపాలరావు నాటకాల్లో చేసిన నటన ఎస్వీ రంగారావు చూసి, గుత్తా రామినీడుకి పరిచయం చేసారు. దీంతో భక్తపోతన మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పెట్టుకున్నారు.

ఆ తర్వాత బంగారు సంకెళ్లు,మూగ ప్రేమ మూవీస్ కి సహాయ దర్శకునిగా పనిచేసి,జగత్ కిలాడీలు మూవీలో విలన్ గా నటించి భేష్ అనిపించుకున్నారు. అయితే ఆ సినిమాలో ఆయన కంఠస్వరం నచ్చకపోవడంతో వేరొకరితో ప్రొడ్యూసర్స్ డబ్బింగ్ చెప్పించారట. అయితే ఆతర్వాత కాలంలో ఆయన గొంతులోని విలక్షణతను బాపు రమణలు గుర్తించడంతో దశ మారిపోయింది. ఇక ఏపాత్ర వేసినా డైలాగ్ డెలివరీతో,అభినయంతో ఆకట్టుకోవడం రావుగోపాలరావు విలక్షణ శైలి గా మారింది.

సాంఘిక సినిమాల్లోనే కాదు,పౌరాణిక,జానపద చిత్రాల్లో కూడా తనదైన మాటలతో మెప్పించారు. వేటగాడు సినిమాలో యాసతో కూడిన పెద్ద పెద్ద డైలాగులు రావు గోపాలరావు అవలీలగా చెప్పేసి,ఆడియన్స్ హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నారు. గోపాలరావు గారి అమ్మాయి సినిమాలో ఆయన నట విశ్వరూపం కనిపిస్తుంది. అభిలాష,ఛాలెంజ్ మగధీరుడు,కొండవీటి రాజా,కిరాయి రౌడీలు,ఖైదీ,కటకటాల రుద్రయ్య, యమగోల, జస్టిస్ చౌదరి,ఘరానా మొగుడు, దేవాలయం,చండశాసనుడు,సర్దార్ పాపారాయుడు,బొబ్బిలి పులి,అల్లరి ప్రియుడు,బొబ్బిలి బ్రహ్మన్న తదితర చిత్రాల్లో తన నటనతో ఆడియన్స్ ని మెప్పించారు.

తెలుగుదేశం ఆవిర్భావంతో ఎన్టీఆర్ కి అండగా నిల్చిన రావుగోపాలరావు రాజ్య సభ సభ్యునిగా ఎన్నికై పార్లమెంట్ లో తన వాణిని విన్పించారు.
వెండితెరపై విలనిజం పండించిన రావు గోపాలరావు నిజ జీవితంలో సౌమ్యుడు. ఈయనకు 19910లో ఆంధ్ర యూనివర్సిటీ కళాప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 1994ఆగస్టు 13న స్వర్గస్తులయ్యారు. ఇక ఆయన నట వారసునిగా రావు రమేష్ ఈతరం వారిని ఆకర్షిస్తున్నారు. మగధీర, కొత్త బంగారు లోకం,గమ్యం,అ ఆ వంటి మూవీస్ తో ఆకట్టుకుంటున్నారు.