Movies

బుల్లితెర హీరోలు రోజుకి ఎంత తీసుకుంటారో తెలుసా?

ఈ రోజుల్లో సినిమాల కన్నా టివి సీరియల్స్ చూసే వారి సంఖ్య అధికంగా ఉంది. టీవీలో వచ్చే సీరియల్స్ సినిమాల కన్నా మంచి స్క్రీన్ ప్లే ,ట్విస్ట్ లు ఉండటంతో రోజు రోజుకి సీరియల్స్ చూసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. సీరియల్స్ లో కథ,కథనం సినిమాలకు మించి ఉండటంతో అందరు సీరియల్స్ వైపుకు ఆకర్షితులు అవుతున్నారు. సీరియల్స్ లో నటించే నటీనటులకు కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
Telugu serial actors
వారి గురించి వివరాలను తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానులకు ఉండటం సహజమే. అందుకే ఇప్పుడు బుల్లితెర హీరోలు రోజుకి ఎంత పారితోషికం తీసుకుంటారో తెలుసుకుందాం.

వాసు
వాసు జెమిని మ్యూజిక్ లో యాంకర్ గా తన కెరీర్ ని ప్రారంభించి ‘రామా సీతెక్కడ’ సీరియల్ తో బుల్లితెర సీరియల్ హీరోగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. వాసు రోజుకి పదివేలు ఛార్జ్ చేస్తాడు.

సీతాకాంత్
సీతాకాంత్ జెమిని మ్యూజిక్ లో యాంకర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసి పాపులర్ సీరియల్ హీరోగా సెటిల్ అయ్యిపోయాడు. అష్టాచెమ్మా , అమెరికా అమ్మాయి’ సీరియల్స్ లో హీరో పాత్ర పోషిస్తూ మంచి పేరు సంపాదించాడు.
సీతాకాంత్ రోజుకి ఇరవై వేలను ఛార్జ్ చేస్తాడు.

పవన్ సాయి
పవన్ సాయి మొగలిరేకులు సీరియల్ ద్వారా కెరీర్ ప్రారంభించి ముద్దుబిడ్డ సీరియల్ తో బుల్లితెరలో సెటిల్ అయ్యాడు. ప్రస్తుతం ముద్దమందారం సీరియల్లో పెదబాబు దేవా గా నటిస్తూ సీరియల్ కే హైలెట్ అయ్యాడు. పవన్ సాయి రోజుకి 15000 ఛార్జ్ చేస్తాడు.

రవికృష్ణ
రవికృష్ణ మొగలిరేకులు సీరియల్ లో గుర్తింపు తెచ్చుకున్న సరే వరూధిని పరిణయంతో కెరీర్ లో సెట్ అయ్యాడు. ప్రస్తుతం దటీజ్ మహాలక్ష్మి అంటూ అలరిస్తున్నాడు. రవికృష్ణ రోజుకి పదివేలు ఛార్జ్ చేస్తాడు.

కౌశిక్
కౌశిక్ బాలనటుడిగా వచ్చి అడపా దడపా సినిమాలు చేసిన ఎక్కువగా బుల్లితెర మీదే ఫోకస్ పెట్టాడు. కౌశిక్ రోజుకి పదివేలు ఛార్జ్ చేస్తాడు.

రవికిరణ్
‘ఇద్దరమ్మాయిలు’ అనే సీరియల్లో గుడ్డివాడు,కుంటివాడిగా నటించి అందరిని అలరించిన రవికిరణ్ రోజుకి 10000 ఛార్జ్ చేస్తాడు.

నిరుపమ్
చంద్రముఖి సీరియల్ తో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన నిరుపమ్ తన కో స్టార్ మంజులను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. సీరియల్స్ హీరోగా నటిస్తూ బుల్లితెర హీరోలా స్థానం సంపాదించుకున్నారు. నిరుపమ్ రోజుకి ఇరవై వేలు ఛార్జ్ చేస్తాడు.

సెల్వరాజ్
చక్రవాకంలో ఇక్బాల్ గా నటించిన సెల్వరాజ్ అందరి మనస్సులో స్థానం సంపాదించాడు. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా మెరుస్తూ ఉంటాడు. సెల్వరాజ్ రోజుకి పదివేలు ఛార్జ్ చేస్తాడు.