Movies

కాస్ట్యూమ్ డిజైనర్లుగా మారిన టాలివుడ్ హీరోల భార్యలు…ఎందుకో తెలుసా?

అన్ని రంగాల్లో వచ్చినట్లే సినీ రంగంలో కూడా ఇప్పుడు కొత్త సెటప్ నడుస్తోంది. హీరోల కుటుంబ సభ్యులు కూడా ఆయా విభాగాల్లో భాగస్వాములవుతున్నారు. ముఖ్యంగా కాస్ట్యూమ్స్ డిజైనింగ్ చూస్తే, కొంతమంది హీరోలకు భార్యలే డిజైనర్లు.

ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని తీసుకుంటే,ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ కాస్ట్యూమ్ డిజైనర్ గా బాలు వంటి సినిమాల్లో ఆమె ముద్ర కనిపిస్తుంది. నిజానికి విభిన్న తరహా పాత్రలతో అలరించడమే కాదు సినిమా వాళ్ళు ఎలా బతకాలో కూడా నేర్పిన ట్రెండ్ సెట్టర్ కమల్ హాసన్. ఈయన లైఫ్ స్టైల్ ని ఎంతోమంది అనుసరిస్తారు. ఈయన హయాంలోనే కాస్ట్యూమ్ డిజైనర్ గా భార్యలు వ్యవహరించడం స్టార్ట్ అయిందని చెప్పాలి.

కమల్ మొదటి భార్య వాణి గణపతి. నటుడిగా నిలదొక్కుకుంటున్న సమయంలోనే భరతనాట్య కళాకారిణి అయిన వాణిని మేరేజ్ చేసుకున్నాడు కమల్. నటుడిగా స్టార్ హోదా తెచ్చుకున్నాక, హీరో చెప్పినట్లు నిర్మాత,దర్శకులు వినాల్సి వస్తుంది కదా. అదిగో అదే సమయంలో వాణికి కాస్ట్యూమ్స్ డిజైనర్ హోదా ఇస్తూ ఆమెను సినీ రంగంలోకి తెచ్చాడు. 1978నుంచి 1988వరకూ ఆమె కమల్ కి కాస్ట్యూమ్ డిజైనర్ అయింది. ఇక ఆతర్వాత ఇద్దరూ విడాకులు పొందాక,మళ్ళీ పెళ్లిచేసుకున్న సారిక కాస్ట్యూమ్ డిజైనర్ హోదా అందిపుచ్చుకుంది.

ఇంద్రుడు చంద్రుడు సినిమాలో కమల్ గెటప్ లో సారిక ముద్ర కనిపిస్తుంది. ఇక సారిక తో విడిపోయాక గౌతమితో లివింగ్ రిలేషన్ షిప్ స్టార్ట్ చేసాడు. కమల్ కూతుళ్లు కూడా ఈ బంధాన్ని గౌరవించారు. ఇక కాస్ట్యూమ్ డిజైనర్ హోదా గౌతమీ వంతు అయింది. కమల్ తో విడిపోయే వరకూ కాస్ట్యూమ్ డిజైనర్ హోదాలో కొనసాగింది.

కాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకి భార్య నమ్రత కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తూ, పోకిరి మూవీ నుంచి మహేష్ లుక్ ని విభిన్న కోణాల్లో మార్చి,సక్సెస్ అయ్యారు. ఇక కాజల్,తమన్నా,సమంత లకు శ్రీను వైట్ల భార్య రూప కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించారు.

ఇక బాహుబలి మూవీతో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన రాజమౌళి కూడా తన భార్య రమా రాజమౌళిని కాస్ట్యూమ్ డిజైనర్ గా తన సినిమాల్లో వ్యవహరించేలా చేస్తున్నాడు. దీంతో ఆమె తనదైన శైలిలో కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తూ సక్సెస్ అయ్యారు.