Movies

బ్రహ్మానందం గురించి ఎవరికి తెలియని కొన్ని నమ్మలేని నిజాలు

అలనాటి హాస్యనటుడు రేలంగి తర్వాత అంతటి స్థాయిలో ఆడియన్స్ ని నవ్వులో ముంచెత్తిన కమెడియన్ గా బ్రహ్మానందం గుర్తింపు పొందాడు. అరగుండు గా జంధ్యాల మార్కు కామెడీతో వెండితెరపై తన హాస్యాన్ని పండించిన బ్రహ్మానందం బ్రహ్మి గా,కత్తి రాందాస్ ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ఆడియన్స్ ని పొట్టచెక్కలయ్యేలా నవ్వించడంలో బ్రహ్మానందం దిట్ట. అసలు బ్రహ్మానందం తెరమీద కనిపిస్తే చాలు నవ్వేసే జనాలు కూడా ఉన్నారు. అంతగా పాపులార్టీ తెచ్చుకున్న ఈయన ప్రస్తుతం టివిలో కామెడీ షోతో అలరిస్తున్నాడు. అది ఏ పాత్ర అయినా అందులో ఇమిడిపోయి ఆడియన్స్ కి హాస్యరసం పంచడం ఆయన స్పెషాల్టీ.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్ల మండలం చాగంటి వారి పాలలెంలో కన్నెగంటి నాగలింగాచారి,లక్ష్మీనరసింహ దంపతులకు 1956ఫిబ్రవరి 1న జన్మించిన బ్రహ్మనందంసత్తెనపల్లి శరభయ్య హైస్కూల్ లో చదువుకున్నారు. తండ్రి సన్నిహితులు సున్నం ఆంజనేయులు ప్రోద్భలంతో భీమవరం డి ఎన్ ఆర్ కాలేజీలో ఇంటర్,డిగ్రీ పూర్తిచేసాడు. గుంటూరులో తెలుగు సాహిత్యం ఎం ఏ పూర్తిచేసాడు. చదువుకునే రోజుల్లో మిమిక్రి చేయడం,కల్చరల్ యాక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొనేవాడు.

అత్తిలిలో 9ఏళ్ళు లెక్చరర్ గా పనిచేసారు. 1985లో దూరదర్శన్ లో వచ్చిన పకపకలు కార్యక్రమంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. నరేష్ హీరోగా నటించిన తాతావతారం మూవీలో దర్శకుడు వేజెళ్ల సత్యనారాయణ మొట్టమొదట సరిగా బ్రహ్మానందం కి మేకప్ వేసి సినిమాకు పరిచయం చేసారు. హీరో షెహితుల్లో ఒకడిగా వేషం కట్టిన బ్రహ్మానందం పుట్టినరోజు ఫిబ్రవరి 1నే సినీ ఛాన్స్ దక్కడం విశేషం. అయితే జంధ్యాల డైరెక్షన్ లో వచ్చిన అహ నా పెళ్ళంట మూవీ ముందుగా విడుదలైంది.

ఆ సినిమాలో ‘పాడెమీద పైసలు ఏరుకునే ఎదవ,పోతావురా ఒరే నాశనమైపోతావ్ వంటి డైలాగులతో యజమాని పిసినారి తనాన్ని మనసులోనే ఎండగట్టే అరగుండు పాత్రలో బ్రహ్మానందం బాగా ఇండిపోయాడు. దీంతో తెలుగు సినిమా ఆయన వైపు దృష్టి సారించింది. కోట శ్రీనివాసరావు తో అరగుండు వెదవ అని తిట్టుంచుకున్న పాత్రే భ్రహ్మనంద నటవిశ్వరూపాన్ని ప్రదర్శిచడానికి వేదికగా నిల్చింది.

ఇక జంధ్యాల డైరెక్షన్ లో వచ్చిన చంటబ్బాయ్ సినిమాలో చిరంజీవికి బ్రహ్మానందాన్ని పరిచయం చేయడం,దాంతో పసివాడి ప్రాణంలో ఓ చిన్న పాత్ర రావడం,దాంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు సాగడం తెల్సిందే. అయితే అహ నా పెళ్ళంట మూవీ లో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ జంధ్యాల,ప్రొడ్యూసర్ డాక్టర్ డి రామానాయుడు ఆతర్వాత పసివాడి ప్రాణం సినిమాలో ఛాన్స్ ఇప్పించిన మెగాస్టార్ చిరంజీవిని ఎప్పటికీ మర్చిపోనని బ్రహ్మానందం చెబుతారు.

అయితే మారిన ట్రెండ్ నేపథ్యంలో హాస్యం పాళ్ళు తగ్గడం,కుర్ర దర్శకులు కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం,వయస్సు మీద పడడం వంటి పరిణామాల నేపథ్యంలో బ్రహ్మానందం లాంటి సీనియర్ కమెడియన్స్ కి ఛాన్స్ లు తగ్గిపోయాయి. ఒకపుడు రోజుకి 20గంటలపాటు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండే బ్రహ్మి ప్రస్తుతం ఛాన్స్ లకోసం ఎదురుచూసే స్థితి వచ్చింది.