తేజ తెలుగు తెరకు పరిచయం చేసిన ఈ తారలు ఇప్పుడు ఏమి చేస్తున్నారో చూడండి
దర్శకుడు తేజకు కొత్త వారిని పరిచయం చేస్తూ ఉంటారు. ఆలా పరిచయం చేసిన వారు ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నారో తెలుసా?
ఉదయ్ కిరణ్ & రీమా సేన్
తేజ వీరిద్దరిని చిత్రం సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం చేసాడు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మనసంతా నువ్వే సినిమా కూడా హిట్ అయింది. ఉదయ్ కిరణ్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. రీమా సేన్ పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ అయ్యిపోయింది.
అనిత
నువ్వు నేను సినిమాతో అనితను టాలీవుడ్ కి పరిచయం చేసాడు. ఇప్పుడు అనిత హిందీ సీరియల్స్ తో బిజీగా ఉంది.
నితిన్ & సదా
జయం సినిమాతో వీరిద్దరూ టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. నితిన్ హీరోగా స్థిరపడ్డాడు. సదా కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.
నవదీప్
జై సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. ప్రస్తుతం తన బిజినెస్ చూసుకుంటూ అడపా దడపా నటిస్తున్నాడు.
కాజల్
లక్ష్మి కళ్యాణం సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయ్యి టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.
ఆది
ఒక వి చిత్రం అనే చిత్రం ద్వారా ఆది పినిశెట్టిని పరిచయం చేసాడు తేజ. ఆది విలన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ప్రిన్స్ సిసిల్ & నందిత రాజ్
2012 వచ్చిన నీకు నాకు డాష్ డాష్ సినిమ ద్వారా యువ నటీనటులు అయిన ప్రిన్స్ మరియు నందిత రాజ్ లను వెండి తెరకు పరిచయం చేసాడు తేజ.