తెలుగు టీవీ యాంకర్ల వయసు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
టీవీ చూడని వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే టీవీలో వచ్చే షోలు,సీరియల్స్ వయస్సుతో సంబందం లేకుండా ఆడవారిని,మగవారిని ఇలా అందరిని కట్టిపాడేస్తున్నాయి. టివి సీరియల్స్ సినిమాల కన్నా మంచి స్క్రీన్ ప్లై తో ఉంటున్నాయి. ఇక షోల విషయానికి వస్తే… జబర్దస్త్,పటాస్,స్టార్ మహిళ వంటి షోలు బాగా పాపులర్ అయ్యాయి.
అలాంటి షోలకు యాంకరింగ్ చేస్తున్న యాంకర్స్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వారి గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉండటం సహజమే. అందుకే ఇప్పుడు ఆ యాంకర్స్ వయస్సుల గురించి తెలుసుకుందాం.
శ్రీముఖి
పటాస్ షో చూసే వారికీ శ్రీముఖి బాగా పరిచయమే. ఈ భామ మొదట సినిమాల్లో నటించినా అక్కడ సక్సెస్ కాలేదు. దాంతో టీవీ రంగానికి వచ్చింది. పటాస్ షో తో ఈ అమ్మడి కెరీర్ మారిపోయింది.
Date of Birth: may10 1993
అనసూయ
జబర్దస్త్ చూసే ప్రతి అభిమానికి అనసూయ తెలుసు. అంతేకాక అనసూయ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ భామ మంచి మంచి పాత్రలతో సినిమాల్లో కూడా అలరిస్తుంది.
Date of Birth: may15 1985
సుమ
యాంకర్ సుమ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇమే ఒక పక్క షోలకు యాంకరింగ్ చేస్తూ,సినిమా ఆడియో వేడుకలకు యాంకరింగ్ చేస్తూ మరో పక్క ప్రొడక్షన్ హౌస్ స్థాపించి షోలను కూడా నిర్మిస్తుంది. ఈ మధ్యనే యూ ట్యూబ్ ఛానల్ ని కూడా ప్రారంభించింది.
Date of Birth: march 22 1975
రోజా
రోజా సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి దర్శకుడు సెల్వమణిని వివాహం చేసుకుంది. పిల్లలు కాస్త పెద్దయ్యాక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. సినిమాల్లో మంచి పాత్రలు వస్తే చేస్తుంది. టెలివిజన్ లో షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఉంది. మరోపక్క రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటుంది.
Date of Birth: nov 17 1972
ఝాన్సీ
ఝాన్సీ బుల్లితెర ప్రయాణం దూరదర్శన్ నుంచి ప్రారంభం అయింది. మొదట్లో కొన్ని సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత యాంకర్ గా మారి ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలను చేసింది. సినిమాల్లో కూడా మంచి పాత్రలు వచ్చినప్పుడు మెరుస్తూనే ఉంటుంది.
Date of Birth: march7 1971
శ్యామల
శ్యామల గలగల మాట్లాడుతూ యాంకరింగ్ చేస్తుంది. ఆమె యాంకరింగ్ తో మంచి జోష్ ఉంటుంది. శ్యామల మొదట్లో కొన్ని సీరియల్స్ లో నటించిన ఆ తర్వాత తన కెరీర్ ని యాంకరింగ్ వైపుకి టర్న్ చేసింది. సక్సెస్ ఫుల్ యాంకర్ గా కొనసాగుతుంది.
Date of Birth: feb7 1985
రేష్మి
జబర్దస్త్ కార్యక్రమంతో బాగా పాపులర్ అయింది ఈ భామ. ఈ పాపులారిటీతో సినిమా అవకాశాలను కూడా సంపాదించించి ఒక పక్క యాంకరింగ్ మరో పక్క సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
Date of Birth: april 7 1988