Movies

నటి పుష్పలత గురించి ఎందుకు ఎవరూ పట్టించుకోలేదో తెలుసా? ఆమె కూతురు టాప్ హీరోయిన్?

తల్లి పాత్రల్లో కరుణ రసం పండించి ,ముదుసలి పాత్రలో దీనంగా నటించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న నటి పుష్పలత. ఒకప్పుడు హీరోయిన్ గా చేసి ఆతర్వాత కేరక్టర్ ఆర్టిస్టుగా మారి అగ్ర హీరోలకు తల్లిగా, మామ్మగా నటించిన ఈమె తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ నటించి మెప్పించింది. ఎల్వి ప్రసాద్ సిఫార్సుతో అక్కినేని నాగేశ్వరరావు సరసన హీరోయిన్ గా చేసి, ఎంట్రీ ఇచ్చిన ఈమెకు సంసారం, పెళ్లిచేసి చూడు వంటి మూవీస్ తో మంచి గుర్తింపు వచ్చింది. ఆనాటి అందాల తారల్లో పుష్పలత ఒకరని చెప్పాలి. అందుకే ఆమె అందానికి ఫిదా అయిన తమిళ నటుడు ఏ వి ఎం రాజన్ ఆమెను పెళ్లాడాడు.

తమిళంలో మంచి పేరు గల రాజన్ తెలుగులో అక్క తమ్ముడు,అన్నదమ్ముల అనుబంధం వంటి మూవీస్ లో చేసాడు. తమిళంలో పలు చిత్రాల్లో ఇద్దరూ కలసి నటిస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు. అలా పెళ్లిపీటలు ఎక్కారు. వీరికి ముగ్గురు కూతుళ్లు ,ఒక కూతురు ఉన్నారు. కొడుకు సత్యనారాయణ తమిళనాడులో మంచి గిటారిస్ట్. చిన్న కూతురు మహాలక్ష్మి 35కన్నడ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఇక తెలుగులో రెండు జెళ్ళ సీత మూవీలో హీరోయిన్ గా సుపరిచితం.

గుండె సంబంధిత వ్యాధితో 87ఏళ్ళ వయస్సులో చెన్నైలో కన్నుమూసిన పుష్పలత తెలుగు , మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకుంది. దాదాపు 100కి పైగా సినిమాల్లో నటించిన ఈమెకు దక్కాల్సినంత గౌరవం రాలేదు. ఎందుకంటే ఈమె మరణించిన వార్త ఒక్క మీడియాలో కూడా రాలేదు. అదీ పరిస్థితి.