Movies

ఈ బాల నటుడు ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడో తెలుసా… ఎన్ని టేలెంట్స్ ఉన్నాయో తెలిస్తే నమ్మలేరు

ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి, ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసిన బాలాదిత్య. ఆ సినిమాలో పిసినారి తండ్రి రాజేంద్ర ప్రసాద్ కి కొడుకుగా పిసినారితనం చూపిస్తూ చేసిన నటన హైలెట్. ఇక దానితర్వాత అన్న, లిటిల్ సోల్జియర్స్,బంగారు బుల్లోడు హిట్లర్,అబ్బాయిగారు,ఏవండీ ఆవిడ వచ్చింది, హలోబ్రదర్ వంటి చిత్రాల్లో నటించాడు. ఆరేళ్ళ వయస్సులో కెరీర్ మొదలుపెట్టి,లిటిల్ సోల్జర్స్,అన్న చిత్రాలకు నంది పురస్కారాలు అందుకున్నాడు. జయ దర్శకత్వంలో చంటిగాడు మూవీ ద్వారా హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వడం ద్వారా మొత్తం పాతికేళ్ల పాటు సినీ ప్రస్థానం సాగించాడు.

ఆతర్వాత మాథ్స్ లో నిష్ణాతుడిగా సి ఐ విద్యార్థులకు పాఠాలు చెబుతూ జీవించడం నిజంగా గ్రేట్. అది నటుడు బాలాదిత్య కే సాధ్యం అయింది. రూమ్ మేట్స్ , 1940లో ఒక గ్రామం వంటి మూవీస్ బాలాదిత్యకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 1940లో ఒక గ్రామం మూవీకి నేషనల్ అవార్డు వచ్చింది. తమిళం,మలయాళం,ఇంగ్లీషు భాషల్లో నటించాడు. దర్శకులు వి మధుసూదనరావు,దాసరి నారాయణరావు,కె బాలచందర్,రేలంగి నరసింహారావు,ఈవీవీ సత్యనారాయణ,ముత్యాల సుబ్బయ్య,రవిరాజా పినిశెట్టి, గుణ్ణం గంగరాజు,బి గోపాల్,తమ్మారెడ్డి భరద్వాజ,వంటి వారి దగ్గర పనిచేసాడు.

ఇక అక్కినేని ,శోభన్ బాబు,రజనీకాంత్,జితేంద్ర చిరంజీవి,బాలకృష్ణ,మోహన్ బాబు,వెంకటేష్,నాగార్జున,డాక్టర్ రాజశేఖర్, చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్,జూనియర్ ఎన్టీఆర్ ,జగపతి బాబు వంటి వారితో కలిసి నటించిన ఘనత కూడా అదిత్యదే.సురేష్ గోపితో కల్సి మళయాళ మూవీలోనూ,కన్నడంలోనూ అలాగే గాంధీ ఆంగ్ల చిత్రంలో బాలాదిత్య బాలనటుడిగా నటించాడు. ఇక హిందీలో రజనీకాంత్ కొడుకుగా త్యాగి మూవీలో నటించాడు.

బాల నటుడిగా 108మూవీస్,హీరోగా 10సినిమాల్లో నటించిన బాలాదిత్య అన్నయ కౌశిక్ బుల్లితెర నటుడే. తండ్రి శంకర్ కూడా హీరోగా నటించారు. విశేషం ఏమిటంటే శంకర్ నటించిన చిత్రం ద్వారా రాజేంద్ర ప్రసాద్ వెండితెరకు పరిచయం అయితే,రాజేంద్ర ప్రసాద్ సినిమాలో నటించడం ద్వారా బాలాదిత్య బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు.