Movies

రజనీకాంత్ బాల్యం ఎలా గడిచిందో తెలుసా?

రజనీకాంత్ దక్షిణ భారతదేశంలో అత్యధిక ప్రేక్షక ఆదరణ ఉన్న నటుడు. అయన డైలాగ్ డెలివరీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కర్ణాటక రాష్టాం లో పుట్టిన రజనీకాంత్ తమిళనాడులో క్రిష్ణగిరి జిల్లాలో నచికుప్పమ్ గ్రామంలో పెరిగారు. రజనీకాంత్ తల్లి జీజాభాయి, తండ్రి రామోజీరావు. తండ్రి కానిస్టేబుల్ గా పనిచేసేవారు. తల్లి రజనీకాంత్ ఎనిమిది సంవత్సరాల వయస్సులో చనిపోయింది. రజనీకాంత్ చదువు అచార్య పాఠశాల భన్నారగట్టా, బెంగళూరు లో జరిగింది. రజనీకాంత్ చిన్నవయస్సులో చాలా కష్టాలను అనుభవించారు.

రజనీకాంత్ సినిమాల్లోకి రాకముందు బెంగుళూర్ లో అనేక రకాల ఉద్యోగాలను చేసాడు. అలాగే నాటకాలలో కూడా నటించాడు. ఆ తర్వాత బస్సు కండక్టర్ గా పనిచేసారు. బాస్ కండక్టర్ గా పనిచేస్తున్నప్పుడే సినిమాల్లోకి వచ్చాడు రజనీకాంత్. తర్వతా రజని 1973 లో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో స్నేహితుల సహయంతో చేరాడు, అక్కడ ప్రభాకరణ్ సహాయం అందించారు.

అక్కడ నుండి రజినికాంత్ వెనక్కి తిరిగి చూడలేదు సుమారు 190 సినిమాలు తమిళ్, తెలుగు, కన్నడ, మళయాలం, హింది భాషల లో పూర్తి చేశాడు. ముత్తు, అరుణచలం, నరసింహ, రోబో, శివాజి, రజనీకాంత్ కి మంచి పెరు తెచ్చిపెట్టిన సినిమాలు.రజనీకాంత్ దాదాపు నాలుగున్నరేళ్ళ తర్వాత చేనిన చిత్రం ‘లింగ’ మధ్యలో కోచడయాన్ వచ్చినా అది యానిమేషన్ ప్రధానంగా సాగే సినిమా, లింగ చిత్రం 12-12-2014 విడుదల కానుంది. ఇప్పుడు రోబో 2.ఓ తో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తిరగరాస్తున్నారు.