Movies

KGF హీరోయిన్ శ్రీనిధి బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా…. RRR లో ఛాన్స్ కొట్టేసిందా?

సినిమా రేంజ్ ని బట్టి సదరు సినిమా గురించి జనంలో చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు కన్నడ చిత్రం కెజిఎఫ్ సినిమా గురించి వరల్డ్ వైడ్ చర్చ నడుస్తోంది. డిసెంబర్ 21న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. కోలార్ బంగారు గనుల నేపథ్యంలో తీసిన ఈ మూవీ లో యువ హీరో యాష్ లీడ్ రోల్ పోషించగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా వేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్ర ట్రైలర్ చూసిన వాళ్ళు అందరూ అద్భుతం అని మెచ్చుకుంటున్నారు. ఈ మూవీ ప్రీరిలీజ్ వేడుక ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఇందులో హీరోయిన్ గా వేసిన శ్రీనిధి యాక్షన్ చూసి, ఎస్ ఎస్ రాజమౌళి అయితే ఏకంగా తాను తీస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో మంగళూరుకు చెందిన ఈ బ్యూటీ కి ఛాన్స్ ఇవ్వాలని కూడా భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్క సినిమాతోనే అంతటి రేంజ్ కి వెళ్లిన శ్రీనిధి గురించి వివరాల్లోకి వెళ్తే, ఈమె తండ్రి రమేష్ శెట్టి, తల్లి కుశల. ఇక చదువుకునే రోజుల్లో ఒక్కసారైనా టివిలో కనిపించాలని భావించిన శ్రీనిధి 2016అందాల పోటీల్లో విజేతగా నిల్చింది. మిస్ కర్ణాటక,మిస్ బ్యూటిఫుల్ స్మైల్ ఇలా ఎన్నో పోటీల్లో విన్నర్ గా నిల్చింది.

ముల్కి పట్టణంలోని శ్రీ నారాయణ గురు ఇంగ్లీషు మీడియం స్కూల్ లో జరిగింది. పియుసి పూర్తిచేసి,బెంగుళూరులోని జైన్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసింది. రెండేళ్లు ఉద్యోగం కూడా చేసిన శ్రీనిధి ఆ సమయంలోనే ఎన్నో అందాల పోటీల్లో మెరిసింది. ఖాళీ సమయాల్లో టివి షోలు చూసే ఈమె బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కూడా. 2016 అందాల పోటీలో శ్రీనిధిని చూసిన కెజిఎఫ్ బృందం తమ హీరోయిన్ గా ఫిక్స్ అయిందట.

అందుకే తొలి చిత్రంతోనే ఇప్పుడు ఏకంగా యావత్ భారతదేశం చర్చించుకుంటున్న కెజిఎఫ్ మూవీలో హీరోయిన్ అయింది. ఈ మూవీతో మరిన్ని ఛాన్స్ లు వస్తాయని ఈ కన్నడ బ్యూటీ భావిస్తోంది.