Devotional

ముక్కోటి ఏకాదశి రోజు పూజను ఈ సమయంలో చేస్తే కోటి జన్మల పుణ్యం,అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి… ఆ సమయం ఎప్పుడో?

ముక్కోటి ఏకాదశి విష్ణువుకు ఎంతో ప్రతీకరమైనది. అందువల్ల ఆ రోజున విష్ణువును ఆరాధిస్తారు. ఎంతో మహిమాన్వితమైన ముక్కోటి ఏకాదశి ఈ సంవత్సరం డిసెంబర్ 19 న రాబోతుంది. ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున కొన్ని పనులను ఖచ్చితంగా చేయాలి. ఈ పనులను చేయటం వలన జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యల నుండి బయట పడవచ్చు. అంతేకాకుండా తెలిసి చేసిన తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. మన హిందూ సంప్రదాయంలో కొన్ని పండుగలు శైవ తత్వాన్ని,విష్ణు తత్వాన్ని భోదిస్తాయి. విష్ణువును ఆరాధించే వైష్ణవులకు ఈ ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైనది.

అలాగే చాలా నిష్ఠగా చేస్తారు. ముక్కోటి ఏకాదశి రోజున సూర్యోదయానికి గంట ముందు స్నానం చేయాలి. ఇంటిలో పూజ చేసుకొని వైష్ణోవ దేవాలయాలకు వెళ్లి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి అలాగే 11 సార్లు విష్ణుసహస్ర నామంను పఠిస్తే భగవద్ అనుగ్రహం కలిగి అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి రోజున చేసే పూజలు,వ్రతాలు అన్ని కుత్రిక నక్షత్రం వెళ్లే లోపే చేసుకోవాలి.

అయితే డిసెంబర్ 19 వ తారీఖున భరణి నక్షత్రం ముగింపు తెల్లవారుజామున నాలుగు గంటల 12 నిమిషాలకు ఉంటుంది. ఆ తర్వాత కృత్రిక నక్షత్రం ప్రారంభం అవుతుంది. కృత్రిక నక్షత్రం డిసెంబర్ 19 బుదవారం తెల్లవారుజామున నాలుగు గంటల 12 నిమిషాలకు ప్రారంభం అయ్యి డిసెంబర్ 20 గురువారం మూడు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది. ఏకాదశి పూజలు ఎప్పుడు చేసుకున్న కృత్రిక నక్షత్రం ఉన్న సమయంలోనే చేయాలి. కృత్రిక నక్షత్రం ఉన్న రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి.

సాదరణంగా సూర్యోదయం అంటే 5 గంటల నుండి 6 గంటల మధ్యలో ఉంటుంది. డిసెంబర్ 19 న తెల్లవారుజామున కృత్రిక నక్షత్రం 4 గంటల 12 నిమిషాలకు ప్రారంభం అయ్యింది. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు చేసే పూజా కార్యక్రమాలను నాలుగు గంటల 15 నిమిషాలకు ప్రారంభించి సూర్యోదయానికి ముందే పూర్తి చేయాలి. అంటే పూజను నాలుగు గంటల 15 నిమిషాల నుంచి 6 గంటల లోపే చేయాలి.