Movies

వీరి తోబుట్టువులు ఇండస్ట్రీలో ఏ పరిస్థితిలో ఉన్నారో తెలుసా?

సినిమాల్లోకి రావడం ఓ ఎత్తు అయితే ,నిలదొక్కుకోవడం మరో ఎత్తు. ఇక హీరోల వారసులు హీరోలుగా, హీరోయిన్స్ వారసులు హీరోయిన్స్ గా అవుతుండడం కూడా ఓ కీలక పరిణామం. అంతేకాదు అక్కా చెల్లెల్లు గ్లామర్ తో ఆకట్టుకోవడం కూడా చూస్తున్నాం. వాళ్ళ తోబుట్టువులను, బంధువులను కూడా ఇలా వెండితెర మీద వెలిగేలా చేయడం ఇంకా గ్రేట్. అయితే చాలామంది హీరో హీరోయిన్స్ సోదరులు,బంధువులు సినిమాల్లో నటిస్తూనే వున్నారు.మరి వాళ్లెవరో ఓ సారి చూద్దాం. అక్క ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్న సమయంలో సోదరి ఎంట్రీ ఇస్తుంది. అలా చూస్తే,టాలీవుడ్ లో ఎక్కువగా అక్కా చెల్లెళ్ళు టాప్ హీరోయిన్స్ గా రాణిస్తున్నారు.

జయసుధ, భానుప్రియ మినహా మిగిలినవాళ్లు ఇతర భాషల వాళ్ళు అక్కాచెల్లెళ్లు టాలీవుడ్ లో రాణించారని చెప్పవచ్చు. జయసుధ, భానుప్రియ,సరిత,జీవిత, రాధికా,కీర్తిరెడ్డి,జ్యోతిలక్ష్మి,నగ్మా , సిమ్రాన్,రాధా ఇలా చాలామంది హీరోయిన్స్ సోదరీలు ఇండస్ట్రీలో తమ సత్తా చాటారు. ఇందులో సరిత చెల్లి విజయ నటి అనే సంగతి చాలామందికి తెలీదు. నిజానికి తనలాగా నటి కావద్దంటూ సరిత చాలా ప్రయత్నాలు చేసింది. కానీ రజనీకాంత్ సోదరిగా 1981లో విజయ చంద్ర శేఖర్ నటించింది. అయితే అది హిట్ కాకపోవడంతో స్టడీస్ పై దృష్టి పెట్టి, చాలాకాలం తర్వాత తమిళ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

డాన్సర్ అయిన ఈమె ఎన్నో స్టేజి షోలు చేసింది. సినిమాల్లో నటిస్తూనే చంద్ర శేఖర్ ని పెళ్లిచేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. సీరియల్స్ లో నటిస్తూ తమిళంలో మదర్ కేరక్టర్స్ చేస్తోంది. జీవితతో పాటు తలంబ్రాలు షూటింగ్ కి వెళ్లిన చెల్లి ఉమా ను చూసిన నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి ఆమెను కళ్యాణ్ చక్రవర్తి చెల్లిగా నటించమని వత్తిడి చేయడంతో అలా ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత రెండు మూడు సినిమాలు చేసినా అవి పూర్తికాలేదు. ఇక చదువు అయ్యాక బిజినెస్ మ్యాన్ ని ఉమ పెళ్ళాడి సెటిల్ అయింది.

ఆర్తి అగర్వాల్ చెల్లెలు అదితి అగర్వాల్. అల్లు అర్జున్ వెండితెరకు పరిచయం అయిన గంగోత్రి మూవీతో అదితి ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత కొడుకు వంటి సినిమాలు ప్లాప్ అయ్యాయి. అయితే 2007లో ఆర్తి అగర్వాల్ పెళ్లి సందర్బంగా తెలుగు జర్నలిస్ట్ పై దాడి కేసులో తండ్రి ,సోదరుడితో పాటు అదితి కూడా జైలుకి వెళ్ళింది. ఆతర్వాత సినిమాలకు దూరం అయింది. కొరియోగ్రాఫర్,దర్శకుడు అయిన రాఘవ లారెన్స్ ఇప్పుడు తమ్ముడు ఎలివే ను వెండితెరకు తెచ్చాడు. నిజానికి లారెన్స్ కి తమ్ముడు ఉన్నట్లు ఎవరికీ తెలీదు. అయితే ఓ సినిమాలో నటించడం తో తెలుగు,తమిళ ఆడియన్స్ కి దగ్గరయ్యేలా లారెన్స్ ప్లాన్ చేస్తున్నాడు.

మరి ఎలివే హీరోగా ఎవరి డైరెక్షన్ లో వస్తాడో చూడాలి. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తిరెడ్డి కి ఓ కజిన్ ఉన్నాడు. అతడే సామ్రాట్ రెడ్డి. అయితే వీరి బంధం గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. రెండు మూడు చిత్రాల్లో రాణించిన సామ్రాట్ రెడ్డి బిగ్ బాస్ షోతో హైలెట్ అయ్యాడు. ఇక ‘ఏమైంది ఈవేళ’ మూవీ తో హీరోయిన్ గా పరిచయం అయిన నిషా అగర్వాల్ కాజల్ కి చెల్లి. అయితే సోలో ఇష్టం,సరదాగా అమ్మాయితో వంటి మూవీస్ లో నటించిన ఈమె అక్కలా రాణించలేకపోయింది. పెళ్ళిచేసుకుని ఫామిలీ లైఫ్ లో బిజీ అయింది.