Movies

‘శంకర్ దాదా MBBS’ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ‘అన్న’ టాలీవుడ్ స్టార్ హీరో… ఎవరో చూడండి

సినిమా రంగంలో ఛాన్స్ లు అంత త్వరగా రావు. ఒకవేళ వస్తే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా వచ్చిన ఛాన్స్ ని సద్వినియోగం చేసుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత శిఖరాలు అధిరోహించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవిని ప్రధానంగా చెప్పుకోవాలి. ఏస్థాయికి చిరంజీవి చేరడంటే అసలు ఈయన లేని సినిమా రంగాన్ని అసలు ఊహించలేం. చిరు పేరు చెబితేనే నటన, డాన్స్,ఫైట్స్ .ఇలా ఈయన గురించి చెబుతూ పొతే ఎన్ని పేజీలు రాసినా తక్కువే. చెప్పడానికి మాటలు కూడా సరిపోవు.

ఎంతో ఎత్తుకి ఎదిగి,యావత్ భారత దేశాన్ని ఆకర్షించిన చిరంజీవిని బేస్ చేసుకుని ఎందరో హీరోలు వారసులుగా ఎంట్రీ ఇచ్చారు. తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్,కొడుకు రామ్ చరణ్,మేనల్లుళ్ళు అల్లు అర్జున్,సాయి ధర్మ తేజ్,తమ్ముడి కొడుకు వరుణ్ తేజ్ ఇలా చాలామంది ఇండస్ట్రీలో తమ టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు. అయితే వీళ్ళందరికీ చిరంజీవి ఆధారం.

ఆయన బ్యాక్ గ్రౌండ్ లేకపోతె వీళ్ళను అసలు ఊహించుకోలేం. అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా అందరూ తమతమ టాలెంట్ తో ఓ ఊపు ఊపేస్తున్నారు. అయితే ఇప్పుడు మరో వారసుడు మెగా కుటుంబం నుంచి రాబోతున్నాడట. ఈ వార్త మీడియాలో,పేపర్స్ లో వైరల్ అయింది. మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీస్ లో ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’సినిమా ఒకటి. ఆసినిమా లో చిరంజీవి నటన హైలెట్. హాస్యం మేళవిస్తూ సాగిన ఆయన నటనకు ఆడియన్స్ అందరూ జేజేలు పలికారు.

ఇక ఈ సూపర్ డూపర్ మూవీలో చైల్డ్ ఆర్టిస్టు గురున్నాడా? జుట్టు బాగా పెరిగిపోయి వీల్ చైర్ లో చలనం లేని కుర్రాడు ఒకడు ఉంటాడు కదా! చిరంజీవి మాట్లాడుతుంటే కనురెప్పలతో సమాధానం చెబుతాడు. ఆ అబ్బాయి పేరు వైష్ణవ్ తేజ్. యితడు చిరంజీవికి మేనల్లుడు. సాయి ధర్మతేజ్ కి తమ్ముడు. సుకుమార్ డైరెక్షన్ లో త్వరలో హీరోగా వైష్ణవ్ తేజ్ ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. మెగా కుటుంబం నుంచి వచ్చే ఈ తాజా హీరో ఎలా దూసుకెళ్తాడో చూడాలి.