Movies

హీరోల ఫెల్యూర్ వెనుక అసలు కారణం ఇదే… మారకపోతే కెరీర్ కష్టమే

సినిమా రంగంలో చిత్ర విచిత్రాలుంటాయి. సినిమా హిట్ అయితే ఇక వాళ్ళను ఆకాశానికి ఎత్తేస్తారు. సినిమాల కోసం క్యూ కట్టేస్తారు. పొరపాటున డిజాస్టర్ అయితే, ఇక అటువైపు ఎవరు చూడరు. ఎంత పెద్ద హీరో అయినా ఇది తప్పదు. కెరీర్ లో చాలామంది ఇలాంటి చేదు అనుభవాలు ఎన్నో చూసి ఉంటారు. అలాంటి ఘటనలు ఓసారి చూద్దాం. యువ హీరోగా రాజ్ తరుణ్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సమయంలో ఫెయిల్యూర్ వచ్చేసింది. ఉయ్యాల జంపాల మూవీతో హీరోగా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. కుమార్ 21ఎఫ్ హిట్ టాక్ తర్వాత ఆడోరకం ఈడోరకం మూవీ కూడా కొంచెం పర్వాలేదనిపించింది.

ఇక వరుస ప్లాప్ లతో నెట్టుకొస్తున్న తరుణంలో లవర్ బాయ్ మూవీ కూడా దెబ్బకొట్టడంతో ఆఫర్స్ తగ్గిపోయాయి. దీంతో ఇక తీసే సినిమాల్లో ఏది బ్రేక్ ఇస్తుందో ఏది ముంచేస్తుందో అర్ధం కానీ అయోమయంలో రాజ్ తరుణ్ కొట్టుమిట్టాడుతున్నాడు.

ఇక మోహన్ బాబు తనయులు మంచు విష్ణు,మంచు మనోజ్ ల కెరీర్ ఏమాత్రం గాడిలో పడలేదు. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఊపందుకోలేదు. అక్కినేని నట వారసునిగా వచ్చిన నాగ చైతన్య కెరీర్ లో రారండోయ్ వేడుక చూద్దాం తర్వాత సక్సెస్ లేదు. ప్రేమమ్ పర్వాలేదని అనిపించుకున్నా, ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఒక్కటంటే ఒకటి కూడా 30కోట్ల మార్క్ దాటలేదు. పైగా సవ్యసాచితో వరుస ప్లాప్ హ్యాట్రిక్ రావడంతో పరిస్థితి బాగోలేదని చెప్పాలి.

అయితే విజయ్ దేవరకొండ 30కోట్ల మార్క్ ఎప్పుడో దాటేసినప్పటికీ ఇండస్ట్రీలో గల విపరీతమైన పోటీ ఇతడిని ఏమిచేస్తుందో చూడాలి. మెగా ఫామిలీ నుంచి వచ్చిన సాయి ధర్మ తేజ్ కొన్నాళ్ల్లు హడావిడి చేసినా, ఆతరవాత వరుస ప్లాప్ లతో సతమత మవుతున్నాడు. ఏకంగా 7 సినిమాలు దెబ్బతినడంతో డేంజర్ జోన్ లోకి వెళ్ళాడు. ఫ్యాన్స్ బానే ఉన్నారన్న ఉద్దేశ్యంతో బడా నిర్మాతలు వస్తున్నా, ఎక్కడ బ్రేక్ వస్తుందో తెలీదు.

హిట్ డైరెక్టర్ టి కృష్ణ కుమారుడు గోపీచంద్ పాతికేళ్ల సినీ ప్రస్థానంలో గత నాలుగేళ్లుగా ఘోరంగా పరాజయం వెంటాడుతోంది. అభిమానులను అలరించేలా ఇతడి సినిమాలు రావడం లేదని చెప్పాలి. ఇక హీరో రామ్ కూడా మార్కెట్ లో ఎదుగుదల లేదు. హలొ గురు ప్రేమకోసమే మూవీ కూడా హిట్ కొట్టలేదు.

50 సినిమాలు పూర్తిచేసిన హాస్య చిత్రాల హీరో అల్లరి నరేష్ కి కొన్నేళ్ల నుంచి హిట్స్ లేకపోవడంతో సపోర్టింగ్ రోల్స్ వేయడానికి సిద్ధపడ్డాడు. మహేష్ బాబు హీరోగా తీస్తున్న మహర్షి మూవీలో సపోర్టింగ్ కేరక్టర్ వేస్తున్నాడు