Movies

సాయి పల్లవి చిన్నప్పుడు చేసిన సినిమాలు ఎలాంటివో తెలుసా?

ఈమధ్య వచ్చే హీరోయిన్స్ మొదటి సినిమాతోనే స్టార్ స్టేటస్ తెచ్చుకుంటున్నారు. పైగా అది చిన్న సినిమా కావడం విశేషం. అయితే ఆ తర్వాత వచ్చిన పాపులారిటీతో చిన్న సినిమాలను పక్కన పెట్టేసి,పెద్ద హీరోల సరసన చేరిపోతున్నారు. ఇక నటించిన సినిమాలు తక్కువే అయినా క్రేజ్ మాత్రం అమాంతం పెరిగిపోయిన స్టార్ హీరోయిన్ ఎవరంటే సాయిపల్లవి అని చెప్పాలి. ఈమె తొలి సినిమాతోనే స్టార్ డమ్ తెచ్చుకుంది. ఈమె ఎవరి పక్కన నటించినా హీరోని మించిన డామినేషన్ ఈమె సొంతం. ఇక ఈమెను వివాదాలు కూడా చుట్టుముట్టాయి. తాజాగా పడిపడి లేచే మనసు మూవీలో నటించింది. శర్వానంద్ తో కల్సి నటించిన ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది.

ప్రాధాన్యత గల పాత్రలను ఎంచుకోవడం వలన సాయిపల్లవి మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో ఫిదా మూవీతో ఎంట్రీ ఇచ్చి అందరిని ఫిదా చేసేసింది. తమిళ్, మళయాళం, తెలుగు భాషల్లో కల్పి కేవలం 7సినిమాల్లోనే హీరోయిన్ గా నటించిన సాయిపల్లవి క్రేజ్ చూస్తే ఎన్నో సినిమాలు చేసినట్టు అనుకుంటాం. ఇంకో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మలార్ తెచ్చిన పాత్రతో దక్షణాదిన సంచలన నటిగా మారిపోయిది. తొలిచిత్రంతోనే అవార్డులు దక్కించుకుంది. ఇప్పటికే మూడు ఫిలిం ఫేర్ అవార్డులు,మూడు సైమా అవార్డులు అందుకుంది.

సాయిపల్లవి నటించిన కణం సినిమా తమిళ ,తెలుగు భాషల్లో విడుదలయింది. తర్వాత ఎం సి ఏ మూవీ చేసిన ఈమె ఇప్పుడు నటించిన ‘పడిపడి లేచే మనసు’ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చి అలరించనుంది. 2015లో మళయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమాలో మలార్ టీచర్ పాత్ర తొలి సినిమా అనుకుంటారు కానీ ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలో నటించింది. మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించిన కస్తూరి మాన్ అనే తమిళ మూవీలో 13ఏళ్ళ వయస్సులో ఉండగా సాయిపల్లవి నటించింది.
Sai Pallavi
ఆ తర్వాత2015లో కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించిన ధామ్ ధూమ్ అనే సినిమాలో ఆమె ఫ్రెండ్ గా సాయిపల్లవి నటించింది. ఆతర్వాత 16 సంవత్సరాల వయస్సులో పూర్తిస్థాయి హీరోయిన్ గా నటించింది. ఇక వివాదాలు కూడా బానే అలుముకున్నాయి. ఎంసిఎ చేస్తున్న సమయంలో నాని,అలాగే కణం సినిమా సమయంలో నాగ సూర్య లతో ఈ మళయాళ బ్యూటీకి విబేధాలు తలెత్తాయని ఇండస్ట్రీ కోడై కూసింది. రెమ్యునరేషన్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గదని అంటారు.