Politics

పవన్ కి మెగా హీరోల మద్దతు ఎలా ఇస్తున్నారో తెలుసా?

రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజం. అయితే ఎంత పెద్ద రాజకీయ నేత అయినా ఒక్కోసారి విమర్శలకు సమాధానం ఇవ్వకుండా వేరే రూట్ లో విరుచుకు పడడం కూడా సహజంగా మారింది. ఇక తాము సపోర్ట్ చేసే నాయకుడి గురించి కూడా మెగా ఫామిలీలో యువ హీరోలు ఆయా సందర్భాల్లో మాట్లాడుతూ ఫుల్లు సపోర్ట్ ఇచ్చేస్తున్నారు. ఇది బాగా గమనించేవారికి అర్ధం అవుతుంది. జనసేన పార్టీ ద్వారా జనంలోకి దూసుకు పోతున్న పవన్ కి ఫామిలీ తో విభేదాలున్నాయని, ఎవరూ సరిగ్గా మాట్లాడుకోరని,ముఖ్యంగా పవన్ అంటే పెద్దగా గిట్టదని ఇలా రకరకాల వాదనలు,వార్తలు వస్తున్నాయి. అయితే అది నిజం కాదని మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్లుగానే ఉందని వారి మాటలను బట్టి చెప్పేయొచ్చు.

పవన్ కళ్యాణ్ పై వివిధ పార్టీల నేతలు చేసున్న విమర్శలకు డైరెక్ట్ గా కాకపోయినా పరోక్షంగా సమాధానం చెబుతూ కొందరికి సుతిమెత్తగా చురకలు అంటిస్తూ మెగా యువ హీరోలు చేస్తున్న కామెంట్స్ చర్చకు దారితీస్తున్నాయి. పడిపడి లేచే మనసు ప్రి రిలీజ్ ఫంక్షన్ లో గెస్ట్ గా వచ్చిన అల్లు అర్జున్ మాట్లాడుతూ రాజకీయాల్లో చంద్రబాబు అయినా, కేసీఆర్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా సరే,గారు అని సంబోధించాలి అని చెప్పుకొచ్చాడు. ఒకరికి గౌరవం ఇవ్వడం తప్పుకాదని, రాజకీయాల్లో చేరినంత మాత్రాన గౌరవం మానేయడం పొరపాటని అన్నాడు.

వ్యక్తిగత విమర్శలు గుప్పిస్తూ,అసభ్య పదజాలం వాడేవాళ్ళకు బన్నీ మెత్తగా బదులివ్వడం ద్వారా పవన్ కి సపోర్ట్ చేసాడని అంటున్నారు.
అలాగే వరుణ్ తేజ్ విషయం తీసుకుంటే అతడు నటించిన అంతరిక్షం మూవీకి రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చాడు. అమెరికాలో పవన్ కళ్యాణ్ స్పీచ్ బాగుందని చరణ్ అన్నాడు. ఇటీవల అమెరికా పర్యటనలో పవన్ ఏమి చెప్పారన్నది కాదు అయన మాటల్లో భావాన్ని తీసుకోవాలని చరణ్ అన్నాడు.

నిజమైన ధైర్యం అంటే,భయం లేకపోవడం కాదు,ప్రతిరోజూ భయాన్ని ఎదుర్కోవడమని,అలా ఎదుర్కొంటే భయాన్ని అధిగమించాలంటే మిమ్మల్ని భయపెట్టే పనినే రోజూ చేయండని, అలా భయంలో మార్పుని ఎదుర్కోకపోవడమే అసలు భయం అంటూ పవన్ స్పీచ్ ఇస్తే,దాన్ని వదిలేసి,భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయాన్ని హైలెట్ చేస్తూ కొందరు పోస్టులు పెట్టేసారు. దీంతో పవన్ కి మెగా యువ హీరోలు అండదండలు పూర్తిస్థాయిలో అందించడానికి రంగం సిద్ధం చేసుకున్నారని అంటున్నారు.