Movies

2018లో టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరో తెలుసా?

కాలగమనంలో ఒక్కో ఏడాది వస్తూ పోతూ ఉంటుంది. కొందరికి మంచి,మరికొందరికి చేదు జ్ఞాపకాలను మిగిల్చి వెళ్ళిపోతుంది. అలాగే 2018వ సంవత్సరం మరో వారంలో ముగియబోతోంది. అయితే ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే ఇందులో నెంబర్ వన్ హీరో ఎవరు అనేది ఇక్కడ తలెత్తే ప్రశ్న. ఎందుకంటే కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వగా, ఎన్నో చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి.

ఇక హీరోల ఫెరఫార్మెన్స్ కి మంచి పేరు వచ్చిందన్న మాట వినిపిస్తోంది. ఏడాది ప్రారంభంలో రంగస్థలం మూవీతో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు రామ్ చరణ్. ఇక అతడికి నటనే రాదన్న విమర్శలను చెర్రీ తిప్పికొడుతూ తన కెరీర్ లోనే మంచి నటన కనబరిచి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. రేస్ లో అందరికన్నా ముందున్నాడు.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు రాజకీయ నేపథ్యంలో వచ్చిన భరత్ అను నేను మూవీ మంచి మార్కులు కొట్టేసింది. సీఎం గా ఎంతోహుందా అయిన నటనతో మహేష్ అందరిని ఆకట్టుకున్నాడు. అయితే పోకిరి,బిజినెస్ మ్యాన్ వంటి చిత్రాల్లోని ఇంటెన్సిటీ మాత్రం ఇందులో మిస్సయిందన్న మాట మాత్రం వినిపించింది.

నాపేరు సూర్య నా ఇల్లే ఇండియా మూవీతో అభిమానుల ముందుకు వచ్చిన బన్నీ ఫెరఫార్మెన్స్ పరంగా అదరగొట్టినప్పటికీ, ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఆర్మీ అధికారి పాత్రలో అల్లు అర్జున్ జీవించాడు. ఈ సినిమాకోసం ఎంతోశ్రమించాడు. అందుకే బెస్ట్ ఫెరఫార్మెన్స్ రేసులో బన్నీ నిలిచాడు.

అర్జున్ రెడ్డి విజయంతో రాత్రికి రాత్రి స్టార్ డమ్ అందుకున్న విజయ్ దేవరకొండ నటించిన గీతగోవిందం మూవీ మంచి టాక్ తో నడించింది . అమాయక ప్రేమికుడు పాత్రలో విజయ్ చేసిన నటనకు మంచి మార్కులు పడ్డాయి. వరుస హిట్స్ తో టాలీవుడ్ లో హీరోగా అవతరించాడు. వంద కోట్ల క్లబ్ లో చేరిన హీరోగా రికార్డుకెక్కాడు.

ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్,యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కల్సి చేసిన అరవింద సమేత మూవీ బ్లాక్ బస్టర్ అయింది. తారక తన నటనతో బాక్సాఫీసుని షేక్ చేసాడు. తండ్రి పోయిన బాధలో చూపిన నటన, పెనిమిటి సాంగ్ లో చూపిన ఎక్స్ప్రెషన్స్ సూపర్బ్ గా నిలిచాయి. గూఢచారితో అడవి శేషు,ఆర్ ఎక్స్ 100లో కార్తికేయ,కృష్ణార్జున యుద్ధంలో నాని పర్వాలేదనిపించారు. అయితే టాప్ ఫైవ్ లో ఇయర్ బెస్ట్ హీరో ఎవరన్నది చెప్పటం కాస్త కష్టమనే చెప్పాలి. అప్పటివరకు కొన్ని విమర్శలను ఎదుర్కొన్న రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో తన నటనతో విమర్శకులతో సైతం ఔరా అనిపించుకున్న రామ్ చరణ్ బెస్ట్ అని చెప్పాలి.