Movies

యాక్టర్ చిన్నా బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా… మామ ఎవరో తెలిస్తే షాకవుతారు

సినిమాల్లో చేరి రాణించాలంటే ఎంతో టాలెంట్ ఉండాలి. బ్యాక్ గ్రౌండ్ ఉండాలి. ఈ రెండు ఉన్నా అదృష్టం కల్సి రావాలి. ఈ మూడు కలగలిస్తే ఇక తిరుగు ఉండదు. అయితే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సరే,టాలెంట్ ఉంటె స్వయం కృషితో ఎదగవచ్చని కూడా మెగాస్టార్ చిరంజీవి వంటి వాళ్ళు నిరూపించారు. ఇక సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, విలన్ గా పలు చిత్రాల్లో నటించి,బుల్లితెర మీదా కూడా తన సత్తా చాటుతూ తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న నటుడు చిన్నా. శివ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన చిన్నా అసలు పేరు జితేందర్ రెడ్డి.

నెల్లూరు జిల్లా లో సంపన్న రెడ్ల కుటుంబంలో పుట్టిన చిన్నా సినీ రంగంపై గల ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు. తండ్రి రామచంద్రారెడ్డి,తల్లి రాజేశ్వరి. తన బ్యాక్ గ్రౌండ్ ని ఏమాత్రం వినియోగించుకోకుండా ,స్వశక్తితో ఎదిగాడు. ఎలాగైనా సినిమాల్లో చేరి,హీరోగా రాణించాలన్న ఉద్దేశ్యంతో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ సినీ రంగంలో అందరి చుట్టూ తిరిగిన చిన్నా మధురానగరిలో మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించి మంచి గుర్తింపు పొందాడు.

1989లో రామ్ గోపాల్ వర్మ తీసిన శివ సినిమాలో హీరో నాగార్జున ఫ్రెండ్ గా నటించడం తన కెరీర్ కి మంచి బ్రేక్ అయింది. సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమాతో హీరోకే కాదు చిన్నా వంటి వాళ్లకు ఛాన్స్ లు వెతుక్కుంటూ వచ్చాయి. హీరోగా ఛాన్స్ లు రాకపోయినా సపోర్టింగ్ పాత్రలు తలుపుతట్టాయి. పుట్టింటి పట్టుచీర సినిమాలో చెల్లెలికోసం ఏదైనా చేసే అన్నపాత్రలో నటించి ముఖ్యంగా ఆడవాళ్ళ చేత కన్నీళ్లు పెట్టించాడు. చైతన్య,అల్లరి పిల్ల,మనీ,కిష్కింద కాండ,మనీ మనీ,అన్వేషణ, ఆంటీ, అల్లుడా మజాకా,సొంతం,శీను వాసంతి లక్ష్మి వంటి సినిమాల్లో నటించాడు.

హీరోకి ఫ్రెండ్ పాత్రలు చాలా సినిమాల్లో వేసిన చిన్నా,ఏ పాత్ర ఇచ్చినా వదులుకోకుండా తన కెరీర్ ని నిలబెట్టుకంటూ,50కి పైగా సినిమాల్లో నటించాడు. తెలుగులోనే కాదు తమిళ,కన్నడ,మళయాళ భాషల్లో కూడా నటించాడు. ఏనాడూ ఛాన్స్ ల కోసం వెంపర్లాడకుండా ఛాన్స్ లు తనను వెతుకుంటూ వచ్చాయని గర్వంగా ఫీలవుతాడు. ఇక డైరెక్షన్ రంగంలో అడుగుపెట్టి మొదటి చిత్రంగా ‘ఆ ఇంట్లో’ అనే మూవీ చేసాడు.

అయితే కమర్షియల్ గా హిట్ కొట్టకపోయినా డైరెక్టర్ గా మంచి పేరుతెచ్చిపెట్టింది. ఇక బుల్లితెరమీద అభిషేకం,అష్టా చెమ్మా వంటి సీరియల్స్ లో లీడ్ కేరక్టర్స్ వేసాడు. ఇంతకీ ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలిస్తే నిజంగా షాకవుతారు.

ఇతడి మేనమామ ఎవరంటే, ఆంధ్రప్రదేశ్ కి ఒకప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురుమల్లి జనార్ధన రెడ్డి. అయినా సరే,తన బ్యాక్ గ్రౌండ్ ని ఎక్కడా వాడుకోలేదు. నా బ్యాక్ గ్రౌండ్ వలన ఛాన్స్ లు వస్తే,అందులో నా గొప్పతనం ఏమిటి అని చిన్నా సింపుల్ గా అనేస్తాడు.