Movies

మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ముగ్గురు పిల్లలు ఏ రంగంలో స్థిరపడ్డారో తెలుసా?

అతి సామాన్య కుటుంబంలో పుట్టి అత్యున్నత స్థాయికి చేరుకునే వాళ్ళల్లో మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఒకరు. ఓ సాధారణ వాద్య కళాకారునిగా జీవితం ప్రారంభించి నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. సంప్రదాయం,పాశ్చాత్య సంగీతం మేళవించి ఎన్నో స్వరాలను సమకూర్చారు. వేలాది పాటలకు సంగీతం అందించి, అందమైన బాణీలతో పదికాలాలపాటు పాడుకునే పాటలు గా అందించిన ఇళయరాజా దాదాపు ఆరువేలకు పైనే పాటలు అందించి,కోట్లాదిమంది సంగీత అభిమానులను సంపాందించుకున్నారు. లెక్కలేనన్ని అవార్డులు వచ్చిపడ్డాయి. ఈయన భార్య జీవ. 2011లో ఆమె మరణించారు. వీరికి ముగ్గురు పిల్లలు. తమిళనాడులోని పన్నైపురం గ్రామంలో పేద కుటుంబంలో జన్మించారు. తండ్రి రామస్వామి,తల్లి చిన తాయమ్మాళ్. నిజానికి ఇళయరాజాకు జ్ఞానదీసకన్ అనే పేరు పెట్టారు.

ఎటుచూసినా పైరుపచ్చని పంటపొలాలు , రైతులు పడుకునే జానపదాలు ఇళయరాజాకు స్ఫూర్తినిచ్చాయి. ఇక రాజయ్య పేరిట పాఠశాల రికార్డులో నమోదుచేయించారు ఇళయరాజా తండ్రి. అయితే అందరూ అతన్ని రాసయ్య అని పిలిచేవారు. ఇళయరాజా సోదరుడు పావళర్ వరదరాజన్ 14ఏళ్ళ వయస్సులో కమ్యూనిస్ట్ పార్టీలో ప్రచారక బృందంలో సంగీత కళాకారుడిగా ఉండేవాడు. ఆ బృందంలో ఊరూరా తిరిగిన ఇళయరాజా,సంగీతంలో ప్రావీణ్యం కోసం 1968లో మద్రాసు చేరారు. ధనరాజు మాస్టారు దగ్గర పలు వాయిద్యాలను నేర్చుకున్నారు.

పెళ్లి వేడుకల్లో , సభల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చే బృధంలో సభ్యునిగా చేరి, సంగీత ప్రస్థానం ప్రారంభించారు. బెంగాలీ చిత్రాలకు గిటారిస్ట్ గా, కీ బోర్డు ప్లేయర్ గా పనిచేసి, ఆతర్వాత కన్నడ సంగీత దర్శకుడు జికె వెంకటేష్ దగ్గర అసిస్టెంట్ గా చేరారు. దాదాపు 200సినిమాలకు ఆయన వద్ద అసిస్టెంట్ గా చేసిన ఇళయరాజా,1976లో అన్నక్కలి అనే తమిళ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. అలా మొదలైన ఇళయరాజా ప్రస్థానం ఎక్కడా వెనుదిరిగి చూడలేదు.

అన్నదాసన్,వాలి,శ్రీ కురుప్పన్, శ్రీ కూర్మం తంపి, వేటూరి సుందర రామమూర్తి, ఆత్రేయ,సిరివెన్నెల సీతారామ శాస్త్రి, గురజార్ , వంటి ఇలా ఎందరో గేయ రచయితల పాటలకు బాణీలు సమకూర్చిన ఘనత ఇళయరాజాది. కొన్ని సంస్థలకు,కొందరు దర్శకులకు ఇళయరాజా ఆస్థాన విద్వాంసుడు అంటే సరిపోతుందేమో. ఆయన పాటలు ఇప్పటికీ కూడా నిత్య నూతనం అని చెప్పాలి. ఇక ఇళయరాజా పిల్లలు ముగ్గురూ కూడా సంగీత దర్శకులుగా , గాయకులుగా రాణిస్తున్నారు.

ఆడవాళ్ళ మాటలకు అర్ధాలే వేరులే సినిమాతో యవన్ శంకర్ రాజా తెలుగులో పాటలు పాడారు. శేషు తదితర చిత్రాల్లో కూడా గీతాలు ఆలపించిన ఈయన ఇళయరాజా కుమారుడే. భారతారిణి,కార్తీక్ రాజా కూడా సింగర్స్ గా తెలుగులో గుండెల్లో గోదారి పాటను పడడమే కాకుండా ఔనా మూవీకి మ్యూజిక్ అందించారు. తమిళంలో అనేక చిత్రాలకు సంగీతం అందిస్తూ పాటలు పాడుతూ రాణిస్తున్నారు. కార్తీక రాజా మళయాళంలో కూడా పాటలు పాడుతూ సంగీత దర్శకునిగా కూడా హవా సాగిస్తున్నాడు.