Movies

నటుడు రాళ్ళపల్లి గురించి నమ్మలేని నిజాలు…ఇప్పుడు ఏమి చేస్తున్నారో తెలుసా?

ఒకప్పుడు సినిమాల్లోకి రావాలంటే నాటక అనుభవం తప్పనిసరిగా ఉండేది. కానీ ట్రెండ్ మారింది. ఇప్పుడు అలాంటివేవీ లేవు. ఇక రంగస్థలం మీద నటుడిగా రాణించి సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్ గా అదరగొట్టిన రాళ్ళపల్లి జీవితం లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఎలాంటి పాత్రనైనా అలవోకగా నటించడంలో దిట్ట. ఇప్పటికీ కూడా ఎలాంటి పాత్ర ఇచ్చినా చేయడమే కాకుండా తనకు ఊతమిచ్చిన నాటక రంగానికి కూడా సేవ చేస్తున్నారు. ఈయన రచించి దర్శకత్వం వహించిన నాటకాలు కూడా ఎక్కువే. దాదాపు 8వేల నాటకాల్లో నటించారు. ఊరుమ్మడి బ్రతుకులు,చలిచీమలు,వంటి అభ్యుదయ సినిమాల్లో నటించి కెరీర్ మొదట్లోనే గుర్తింపు పొందారు.

దాదాపు 850చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించిన రాళ్ళపల్లి నెగెటివ్ రోల్స్ కూడా వేశారు. నటనలో ఎంతటి దిగ్గ్గజమో వంటలో కూడా అంతే టాలెంట్ ఉంది. కె విశ్వనాధ్,వంశీ,కమలహాసన్,జంధ్యాల ఇలా అందరూ రాళ్ళపల్లి వంటకు ఫిదా అయిన వాళ్ళే. వంటలో చేయితిరిగిన రాళ్లపల్లితో వంట చేయించుకోవాలని సెట్స్ మీదా ముందుగానే ఆయన సీన్స్ షూట్ చేయించేసి రెస్ట్ ఇచ్చేవారట.

అలా సినిమాల్లో ఎంతోమందికి తన చేతివంటతో మైమరపించారు. కమలహాసన్ ఓ సారి మాట్లాడుతూ ‘మీరు సినిమాలు వదిలేశాక ఎక్కడికి వెళ్లొద్దు, మద్రాసు వచ్చి నాకు వంట చేసి పెడితే చాలు’అని అన్నాడట. ఇక రాళ్ళపల్లి జీవితంలో ఆయన పెద్ద కుమార్తె మరణం తీవ్ర విషాదం నింపింది. మెడిసిన్ చదవడానికి ఆమె రష్యా వెళ్తూ, ప్రాణాలు కోల్పోయింది.

విమానం ఎక్కే సమయానికి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమెకు విమానాల్లో తీవ్ర అస్వస్థత రావడం,సరైన వైద్య సదుపాయాలు అందించడానికి వీలు కాకపోవడం వలన ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఏ విమానంలో అయితే మెడిసిన్ చదవడానికి వెళ్లిందో అదే విమానంలో విగతజీవిగా తిరిగి చేరుకోవడం తో రాళ్ళపల్లి తల్లడిల్లిపోయారు.

ఆ షాక్ నుంచి చాన్నాళ్లు కోలుకోలేదు. టివి సీరియల్స్ లో కూడా రాళ్ళపల్లి నటిస్తూ తన సత్తా చాటుతున్నారు. నటుడిగా ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించిన రాళ్ళపల్లి నాటకాల్లో వేసే సమయంలో బాగా అప్పులపాలయ్యారట. నాటకాలలో వచ్చిన సొమ్మంతా తిరిగి నాటకాలకు ఖర్చుచేసేవారట. ఒకసారి రిహార్సల్స్ అయ్యాక ఇంటికి వెళ్తుంటే అప్పులవాళ్ళు ఆయన ఇంట్లోనుంచి సోఫాలు వంటివి తీసుకుపోతున్నారట. అయితే రాళ్ళపల్లి శిష్యులు తనికెళ్ళ భరణి తదితరులు సొమ్ము కట్టి వాటిని విడిపించారట.