Movies

సుశీల కెరీర్ లో మాయని మచ్చలా మారిన ఘటనలు… కెరీర్ మీద ప్రభావం?

అహం దెబ్బతింటే వెంటనే కొందరు ప్రతాపం చూపించేస్తారు. ఇంకొందరు సమయం కోసం వెయిట్ చేస్తారు. అన్ని రంగాల్లో ఇలాంటి ఇగోలు సర్వ సహజం గా మారిపోయాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో కూడా ఇలాంటివి ఎక్కువే. ఫామ్ లో ఉన్నప్పుడే పదుగురినీ దగ్గర చేర్చుకోవాలి. ఎదుటి వాళ్లకు బాధకలిగేలా వ్యవహరిస్తే అది జీవితంలో పెద్ద ప్రభావం చూపిస్తాయి. సరిగ్గా ప్రముఖ గాయని పి . సుశీల విషయంలో చూడవచ్చు.అయితే ఈమె ఎదుటి వ్యక్తిపై అభాండం మోపి,తిట్లకు గురిచేయడం వలన దాదాపు 20ఏళ్లపాటు చాలా ఛాన్స్ లు కోల్పోయారని అంటారు. అదేమిటో చూద్దాం. లేలేత గొంతుతో తన గాన మాధుర్యంతో దక్షిణ భారత దేశంలో ఆబాల గోపాలాన్ని అలరించిన సుశీల కొన్ని దశాబ్దాల పాటు చిత్ర సీమని ఏలారు. ఆమె పాడిందే పాట అన్నట్లు సాగింది.

రోజుకి 15నుంచి 20పాటలు రికార్డ్ చేసిన రోజులున్నాయంటే సుశీల గొప్పతనం గురించి చెప్పక్కర్లేదు. ఆరోజుల్లో సాంగ్ రికార్డింగ్ అంటే ముందుగా రిహార్సల్స్ చేసి,సాంగ్ పాడేవాళ్లు. అయితే సుశీల్ బిజీ కారణంగా ఓ సంఘటన చోటుచేసుకుంది. ఓరోజు బిజీ యో మరొకటి తెలీదు గానీ సాంగ్ రిహార్సల్స్ కి రాలేదు. ఇక మరుసటి రోజు వచ్చీ రాగానే టేక్ చేద్దామా అనేసారు. గ్రేట్ కంపోజర్ ఎంఎస్ విశ్వనాధం మ్యూజిక్ డైరెక్షన్ లో పాట కావడం విశేషం. ఈయన దగ్గర ఇళయరాజా అసిస్టెంట్ గా ఉండేవారు.

ఇక పాట స్టార్ట్ చేసారు. కానీ ఎన్నిసార్లు పాడినా ఎంఎస్ విశ్వనాధం కి నచ్చడం లేదు. అలా జరుగుతుంటే కొంచెం గ్యాప్ తీసుకుని మళ్ళీ పాడారు. అయితే మళ్ళీ తప్పు రావడంతో ఆ తప్పుని ఇళయరాజా మీదికి సుశీల నెట్టేశారు. కీ బోర్డు తప్పుగా వాయిస్తున్నారని, నాకు కన్ఫ్యూజన్ గా ఉందని సుశీల అనడంతో ఇళయరాజాను విశ్వనాథన్ చెడా మడా అందరి ముందు తిట్టేసారు. దీంతో తీవ్రంగా నొచ్చుకున్న ఇళయరాజా అక్కడనుంచి నిష్క్రమించారు.

నలుగురిలో జరిగిన అవమానాన్ని ఆయన మరిచిపోలేదు. రివెంజ్ తీర్చుకున్నారు. సంగీత సామ్రాజ్యంలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న సమయంలో సుశీలకు అసలు ఛాన్స్ లు ఇచ్చేవారు కాదు. కొన్ని వేల పాటలు ట్యూన్ చేస్తే అందులో అతికొద్ది మాత్రమే సుశీల పాడారు. అది కూడా ప్రొడ్యూసర్స్ రిక్వెస్ట్ మీద పాడించినవేనట. సాధ్యమైనంతరకూ సుశీల ను పట్టించుకోకుండా, ఎస్ జానకిని ఎంకరేజ్ చేసేవారు. మరో దశాబ్దం తర్వాత చిత్రను ఎంకరేజ్ చేసారు. నిజానికి ఒక సినిమాకు ఒకరిద్దరు సింగర్స్ మాత్రం ఉండేవారు. ఇప్పుడయ్యింటే ఐదారుగురు సింగర్స్ ఉంటున్నారు.

ఇళయరాజాతో గొడవ ఉందా అంటే అలాంటిందేమీ లేదని,ఆయన సంగీత దర్శకత్వంలో చాలా పాటలు పాడానని ఓ ఇంటర్యూలో సుశీల చెప్పారు. ఇక సుశీలను ఎదగనీయకుండా జానకి గోతులు తవ్వేసిందన్న పుకార్లూ వున్నాయి. ఇక సుశీలకు జరిగిన అన్యాయం పై ఎస్పీ బాలు కూడా ఏదీ నిక్కర్చుగా చెప్పలేదు.

ఇళయరాజాకు స్వరం కన్నా ఎక్స్ ప్రేషెన్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వలన చక్కటి స్వరమైన సుశీల కన్నా ఎక్స్ ప్రేషెన్ ఎక్కువ గల జానకిని ఎక్కువగా ఇళయరాజా ఎంకరేజ్ చేశారని అంటారు.