Devotional

2019 లో ఏలినాటి శని వదిలి కుబేరులు కాబోతున్న రాశులు..మీ రాశి ఉంటే మీరు అదృష్టవంతులు

2019 వ సంవత్సరంలో శని అనుగ్రహం ఏ రాశులపై ఉంది. శని అనుగ్రహం వలన ఆ రాశులకు ఎలాంటి పరిస్థితులు కలుగుతున్నాయో తెలుసా? ఏ రాశులకు ప్రతికూలంగా ఉంటుందో తెలుసుకుందాం. శనిగ్రహం న్యాయానికి,నీతి నిజాయితీ,ధర్మానికి కారకుడు. కొంత మందికి ఎవరి ప్రోత్సహం లేకపోయినా అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. కొంత మందికి అవకాశాలు వచ్చిన సద్వినియోగం చేసుకోలేక అవమానాలను పొందుతూ ఉంటారు. వీటి అన్నింటికీ కారణం శనిగ్రహమే. అలాగే ప్రతి మనిషి జీవితంలో ఏదైనా సాధించాలన్నా శని గ్రహం అనుగ్రహం ఉండాల్సిందే. ప్రతి విషయంలోనూ సమన్వయంగా ,సమ న్యాయంగా,నియమ నిబంధనలను పాటిస్తూ

ఉంటే కనుక వారి పట్ల శనిదేవుడు అనుకూలమైన ప్రభావాన్ని చూపుతాడు. అలా కాకుండా ఎదుటివారికి ఇబ్బంది కలిగించిన,బాధ కలిగించిన వారి పట్ల శనిదేవుడు ఆగ్రహంగా ఉండి ప్రతికూల ప్రభావాలను చూపుతాడు. జీవితంలో ఎన్ని రాజయోగాలు ఉన్నా, ఎన్ని ఆస్తులు ఉన్నా.సౌఖ్యలను అనుభవించాలంటే ఆయుషు ఉండాలి. అటువంటి ఆయుషు విషయంలో కూడా శనిదేవుడు ప్రధాన పాత్ర పోషిస్తాడు. శనిదేవుడు అనుగ్రహం ఉంటే అన్నీ రకాలుగా ఆనందంగా ఉండవచ్చు. స్త్రీలను చులకనగా చూసేవారు,స్త్రీలను వేదింపులకు గురి చేసేవారి పట్ల శనిదేవుడి అనుగ్రహం ఉండదట.

ఏ రాశికి చెందిన వారైనా సరే ప్రస్తుత గ్రహ స్థితిలో శని ఏలినాటి స్థితిలో గాని ,అర్ధ ఆస్తమా స్థానంలో కానీ ఉన్నప్పుడు ఆ రాశివారిని ఇబ్బందులు మరియు బాధలకు గురి చేయడు. ప్రతి రాశిలో శని రెండున్నర సంవత్సరాల పాటు లేదా ఏడు న్నర సంవత్సరాల పాటు మాత్రమే ఉండగలుగుతాడు. శని ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తాడో ఆ తర్వాత భవిష్యత్ అంత కన్నా ఎక్కువగా బాగుంటుంది. భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుంది. అసలు ఎప్పుడు శనిదేవుడు మనకు అనుకూలంగా లేడని భావించకూడదు. మనం చేసే చిన్న చిన్న పూజలకు శనిదేవుడు తొందరగా ప్రసన్నం అవుతాడు.

ఆంజనేయస్వామిని పూజించేవారికి శని భాదలు ఉండవు. వారి మీద అనుకూలమైన ప్రభావాన్ని చూపుతాడు. శనిదేవుడు పెట్టె పరీక్షలను సహనంతో ఎదుర్కొంటే భవిష్యత్ లో ఉన్నతమైన భవిష్యత్ ఉంటుంది. 2019 వ సంవత్సరంలో శని ప్రభావం 12 రాశుల వారిపై ఉండబోతుంది. 2019 లో ఏ రాశిపై శని అనుగ్రహం ఉంటుంది. ఏ రాశిపై ప్రతికూల ప్రభావాన్ని ఉంటుందో తెలుసుకుందాం. అలాగే శని కారణంగా వారి జీవితంలో జరిగే మార్పులు ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

మేష రాశి

2019 వ సంవత్సరంలో మేష రాశివారికి శని గ్రాహం యొక్క అనుగ్రహం పెద్దగా ఉండకపోవచ్చు. వీరి జీవితంలో ముఖ్యమైనవి చేయి జారిపోతూ ఉంటాయి. తోబుట్టువులు, మీకు ఇష్టమైన వారి పట్ల ఇంతకూ ముందు కన్నా ఎక్కువ శ్రద్ద చూపించాల్సి ఉంటుంది. 2019 లో ఆదాయం కాస్త తగ్గవచ్చు. మీకు శత్రువుల నుంచి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మీరు ఎంత మంచి ప్రవర్తనతో ఉన్నా సరే అది ఎదుటివారికి చెడుగానే కనపడుతుంది. 2019 వ సంవత్సరంలో శని ప్రభావం కారణంగా ఖర్చులు పెరుగుతాయి. అంతేకాక ఎంత అనుకూలంగా ఉన్నా, ఎంత పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసిన మీ ప్రయత్నం వృధా అయ్యి ఎదుటి వ్యక్తులకు మీరు చెడ్డ వ్యక్తులుగానే కనపడతారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.

వృషభ రాశి

2019 వ సంవత్సరంలో వృషభ రాశివారికి శని ప్రభావం కారణంగా చేతికి అందే ప్రతిదీ అకస్మాత్తుగా కోల్పోవలసి వస్తుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. అంతేకాక పాత రుణ సమస్యలు కూడా ఒక్కసారిగా మీదకు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి 2019 వ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో బదిలీ కోరుకొనేవారికి వారు కోరుకున్న చోటకు ప్రమోషన్ మీద వెళ్లే అవకాశం ఉంది. వారసత్వంగా ఆస్థి కలిసి వస్తుంది. మంచి కార్యాలను చేస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశివారికి 2019 వ సంవత్సరంలో శని దేవుడు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాడు.

మిధున రాశి

2019 వ సంవత్సరంలో మిధున రాశివారికి శని దేవుడు మంచి ఫలితాలను ఇవ్వడు. ఆర్ధికంగా పరిస్థితి బాగున్నా కాస్త ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామితో సఖ్యత బాగుంటుంది. ఒకరినొకరు బాగా అర్ధం చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. 2019 వ సంవత్సరంలో మిధున రాశివారికి శని దేవుడు మంచి ఫలితాలను ఇవ్వడు.

కర్కాటక రాశి

2019 వ సంవత్సరంలో కర్కాటక రాశివారికి శని దేవుడు సంవత్సరం మొత్తం కలిసి రాడు. నల్లని వస్తువుల కారణంగా ఆరోగ్య సమస్యలు,శత్రుత్వాలు, కొన్ని రకాల సమస్యలు కలుగుతాయి. శని స్థానం ఉచ్చ స్థానంలో ఉంటే వారికీ ఆర్థికపరమైన రుణాలు వస్తాయి. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కొన్ని నష్టాలు కలుగుతాయి. లోహాలకు సంబంధించి వ్యాపారాలు చేస్తున్న వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.

సింహ రాశి

2019 వ సంవత్సరంలో సింహ రాశివారికి శని దేవుడు సంవత్సరం మొత్తం అనుకూలంగా ఉండుట వలన ఆర్ధికంగా చాలా బలంగా ఉంటారు. వారసత్వ సంపద కూడా బాగా కలిసివస్తుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. గర్భవతులకు శని కొన్ని సమస్యలను కలిగిస్తాడు. 2019 వ సంవత్సరంలో శని సింహ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటాడు. ఒక్క గర్భవతుల విషయంలో మాత్రమే ప్రతికులంగా ఉంటాడు.

కన్య రాశి

2019 వ సంవత్సరంలో కన్య రాశివారికి శని దేవుడు అనుకూలంగా లేకపోవటం వలన ప్రిత్రార్జితం ఆస్తులను కొంత ఖర్చు చేస్తారు. శని ప్రభావం కారణంగా కన్య రాశివారికి 2019 వ సంవత్సరంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. తీర్ధయాత్రలు చేస్తారు.

తుల రాశి

2019 వ సంవత్సరంలో తులా రాశివారికి శనిదేవుడు మిశ్రమ ఫలితాలను కలిగిస్తున్నాడు.ఈ రాశివారు రియల్ ఎస్టేట్ లో మంచి లాభాలను చూస్తారు. ఉద్యోగంలో బదిలీలు కోరుకొనేవారికి చిన్న చిన్న విఘ్నలు కలుగుతాయి. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు.

వృశ్చిక రాశి

2019 వ సంవత్సరంలో వృశ్చిక రాశివారికి శని దేవుడు మంచి ఫలితాలను ఇవ్వడు. ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతుంది . కంటికి సంబందించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశివారికి జనవరి 2020 వరకు ఏలినాటి శని ఉంటుంది. రాబడి,ఖర్చు రెండు సమానంగా ఉంటాయి. ఈ రాశివారికి ఏలినాటి శని ప్రభావం కారణంగా కొన్ని చికాకులు కలుగుతాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.

ధనస్సు రాశి

2019 వ సంవత్సరంలో ధనస్సు రాశివారికి శనిదేవుడు ప్రభావం కారణంగా సంవత్సరం మొత్తం శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. కోరుకున్న విధంగా శారీరక సౌఖ్యం ఉండదు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి. చికాకులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ధనస్సు రాశివారికి శని ఆర్ధికంగా ఎటువంటి ఇబ్బందులను కలిగించడు. శని కారణంగా దనస్సు రాశివారు సంపాదించిన మొత్తంలో కొంత పొదుపు చేస్తారు.

మకర రాశి

2019 వ సంవత్సరంలో మకర రాశివారికి ఏలినాటి శని ప్రభావం ఉంది. ఈ ప్రభావం కారణంగా 2019 వ సంవత్సరంలో అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన ఆడంబరాలకు ఖర్చు చేస్తారు. ఆర్ధికంగా పరిస్థితి మెరుగుదల ఉండదు. ఖర్చులు ఎక్కువగా ఉండుట వలన కొన్ని ఆస్తులను అమ్మవలసిన పరిస్థితి కలగవచ్చు. ఈ రాశివారికి ఆర్ధికముగా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారు చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. మొత్తం మీద 2019 వ సంవత్సరం మకర రాశివారికి అనుకూలమైన ప్రభావం ఉండదు. కాబట్టి శనిదేవునికి శాంతి జపాలను చేయించుకోవాలి.

కుంభ రాశి

2019 వ సంవత్సరంలో కుంభ రాశివారికి శని ప్రభావం కారణంగా ఆర్ధికంగా బాగా కలిసి వస్తుంది. కుంభ రాశివారికి 2019 వ సంవత్సరం మొత్తం శని అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఉన్నతమైన ఫలితాలు కలుగుతాయి. విదేశీ యానం, ఉద్యోగంలో ప్రమోషన్స్, ఊహించిన దాని కన్నా ఎక్కువ ఆదాయం వచ్చేలా శని అనుగ్రహం ఉంటుంది. 2019 వ సంవత్సరంలో మే నుంచి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. ఏలినాటి శని ప్రారంభం అయ్యేవరకు పరిస్థితి బాగుంటుంది. ఏలినాటి శని ప్రారంభం అయ్యాక పరిస్థితిల్లో చాలా మార్పులు వస్తాయి.

మీన రాశి

2019 వ సంవత్సరంలో మీన రాశివారికి శనిదేవుడు విశేషమైన ధనలాభాన్ని కలిగిస్తాడు. నూతన ఆదాయాన్ని సమకూర్చే విధంగా శని అనుగ్రహం ఉంటుంది. ఈ రాశివారి ఆర్ధిక పురోగతి చాలా వేగంగా ఉంటుంది. ఆర్ధికంగా బాగా స్థిరపడతారు. వీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది. 2019 వ సంవత్సరం మీన రాశివారికి శని మంచి ఫలితాలను ఇస్తున్నాడు.