ఎవరూ పట్టించుకోని వినాయక్ కి వెంకటేష్ ఎందుకు అఫర్ ఇచ్చాడో తెలుసా?
తెలుగు ఇండస్ట్రీలో హిట్ కొడితే ఒకలాగా, ప్లాప్ అయితే మరోలా ట్రీట్ చేస్తారు. ఎన్ని హిట్స్ వున్నా, ఒకటి ప్లాప్ అయిందా ఇక అటువైపు చూడనే చూడరు. పట్టించుకోరు. ప్రస్తుతం అగ్రశ్రేణి డైరెక్టర్ వివి వినాయక్ విషయంలో ఇదే జరుగుతోంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్,బాలకృష్ణ,చిరంజీవి, వెంకటేష్ ,బన్నీ, నితిన్,ప్రభాస్ ఇలా అందరితో మూవీస్ తీసి హిట్స్ కొట్టాడు. కొన్ని డిజాస్టర్ కూడా అయ్యాయి. అయితే ఈ డైరెక్టర్ కి ఇప్పుడు ఛాన్స్ లు లేవు. వినాయక్‌తో చిన్న హీరోలు కూడా సినిమాలు చేసేందుకు జంకుతున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు బాలకృష్ణ ఒక సినిమాను వినాయక్‌తో చేసేందుకు ఓకే చెప్పాడని వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత బోయపాటితో బాలయ్య మూవీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇక బాలయ్య మూవీ పనిలో ఉన్న కారణంగా వినాయక్ మరో హీరోను వెదుకున్నాడు. అదెవరో కాదు,విక్టరీ వెంకటేష్. గతంలో వినాయక్,వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన లక్ష్మి మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అందుకే ఇటీవలే వెంకటేష్ ఈయన దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
కథ ఇంకా ఏది కూడా ఫిక్స్ కాకుండానే వినాయక్ దర్శకత్వంలో నటించేందుకు వెంకీ ఓకే చెప్పా డంటే , వినాయక్ పై గల నమ్మకమే కారణమని సినీ పండితులు అంటున్నారు. తనకు గతంలో వినాయక్ సక్సెస్ ఇచ్చాడనే ఉద్దేశ్యంతో ఇప్పుడు ఆఫర్ ఇచ్చేందుకు వెంకటేష్ ముందుకు వచ్చాడని అంటున్నారు. ఈ ఆఫర్‌తో వినాయక్ తనను తాను నిరూపించుకుంటాడేమో చూడాలి. భారీ ఎత్తున వెంకీ, వినాయక్‌ల మూవీని నిర్మించేందుకు సి కళ్యాణ్ కూడా సిద్దం అవుతున్నట్లు టాక్.
వెంకీ తాజాగా ‘ఎఫ్2’ చిత్రంతో పాటు, మేనల్లుడు నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత వినాయక్ మూవీ చేయనున్నాడు. ప్రస్తుతం వినాయక్ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట. వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమా పట్టాలెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. మరి వినాయక్ కి ఈ మూవీతో పూర్వ వైభవం వస్తుందని ఆశిద్దాం.