Movies

వినయ విధేయ రామ ఎలా ఉండబోతుంది… అసలు కథ ఏమిటో చూడండి

రంగస్థలం మూవీ తర్వాత రామ్ చరణ్ కధానాయకుడిగా రాబోతున్న సినిమా వినయ విధేయ రామ. టైటిల్ సాఫ్ట్ గా ఉన్నా పూర్తి మాస్ ఎంటర్ టైన్ గా తెరకెక్కుతోంది. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాలో అసలు ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం అందరిలో ఉంది. డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో మాస్ ఫైట్స్,ఫుల్ ఎమోషన్స్ తో పాటు సెంటిమెంట్ కూడా బలంగానే ఉంటుందట. నలుగురు అన్నదమ్ముల్లో రామ్ చరణ్ చివరివాడుగా ఉంటాడట. అయితే నిజానికి వీళ్ళు నిజంగా సోదరులు కారు. ఒకేచోట కల్సిమెల్సి అన్నదమ్ములుగా పెరిగినట్లు తెలుస్తోందని కొందరు విశ్లేషకులు,సినీ క్రిటిక్స్ అంటున్నారు.

ఇక వీళ్ళ నలుగురిని ముఖేష్ ఋషి పెంచుతాడట. ఇక్కడే విలన్స్ రావడం,ఓ సమస్య తలెత్తడం వంటివి జరుగుతాయని అంటున్నారు. విలన్స్ నుంచి తన ఫ్యామిలీని కాపాడ్డానికి ఓ రక్షకునిగా ఎలా మారాడో ఈ సినిమా ఇతివృత్తంగా చెబుతున్నారు. తెలుగు రాంబో మాదిరిగా రామ్ చరణ్ కనిపించబోతున్నాడట. సురేష్ ఒబెరాయ్ విలనిజం,మాస్ నేపధ్యంగా అతడికి డిజైన్ చేసిన క్యారక్టర్ గానీ సినిమాని హైలెట్ చేస్తాయని అంటున్నారు. బోయపాటి క్రియేటివిటీ, రామ్ చరణ్ ఫైట్స్ ,నటన ఓ రేంజ్ లో చూపించబోతున్నారట.

ఆర్యన్ రాజేష్ ,ప్రశాంత్ ,స్నేహ ల తో కూడిన రామ్ చరణ్ అన్నదమ్ముల అనుబంధం,ఎమోషన్స్ సీన్స్ అందరినీ ఆకట్టుకుంటాయని అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ ట్విస్ట్ అదిరిపోయేలా ఉంటుందట. ఇక దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందట. ఇక సాంగ్స్ మంచి హైప్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు.

ఏక్ బార్ సాంగ్,తస్సాదియ్యా సాంగ్ మాస్ ని ఎక్కడికో తీసుకెళ్తుందని అంటున్నారు. ఎందుకంటే కొరియోగ్రఫీ కూడా బాగా తోడై, చెర్రీ వేసిన స్టెప్స్ కిక్కు ఎక్కిస్తాయని అంటున్నారు. గ్యారంటీగా బ్లాక్ బస్టర్ అవుతుందని,200కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.