Movies

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధం అవుతున్న పవన్ కొడుకు అకిరా

మెగా ఫ్యామిలీలో ఇప్పటికే చాలా మంది హీరోలు ఉన్నారు. ఆ లిస్ట్ లోకి పవన్ రేణుల కొడుకు అకిరా చేరబోతున్నాడు. ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో రేణు మాట్లాడుతూ అకిరా బ్లడ్ లోనే యాకింగ్ ఉందని, చిరంజీవి పెదనాన్న , పవన్ కళ్యాణ్ నాన్న అవుతారు కాబట్టి అకిరా లో కూడా అదే రక్తం ప్రవహిస్తోంది కాబట్టి సహజంగానే నటన అకిరా రక్తంలోనే ఉంది కాకపోతే ముందుగా చదువు పూర్తయ్యాకే సినిమాల్లో నటిస్తానంటే ఒపుకుంటాను కానీ చదువు పూర్తిచేయకుండా ఒప్పుకోను అని స్పష్టం చేసింది .

తాజాగా రేణు దేశాయ్ కవిత సంకలనం తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది . అందులో భాగంగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అకిరా నందన్ పై మాట్లాడింది . యుక్త వయసులో ఉన్న అకిరా ఇంకా సినిమాల్లోకి రావాలంటే 5లేదా 6 ఏళ్లకు పైగానే పడుతుంది . ఒకవేళ చదువు ని పక్కన పెట్టి వస్తానంటే కూడా ఏమి చేయలేము . వారసుల రాజ్యం లోకి పవన్ కళ్యాణ్ కొడుకు కూడా రావడానికి సిద్ధం అవుతున్నాడు . అయితే యాక్టింగ్ లో ఎదో ఒక స్పెషాలిటీ చూపిస్తేనే ఆదరిస్తారు లేదంటే ……. !